గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ నుండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
జీతం 31,000 రూపాయలు వరకూ, ECIL హైదరాబాద్ లో ఉద్యోగాలు, ఇప్పుడే అప్లై చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో జీతములు.
3). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ.
ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేయబోయే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఈసీఐఎల్ డివిజన్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం మనం ఇపుడు తెలుసుకొందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 11, 2021.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 21,2021.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహణ తేది : త్వరలో..
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నికల్ ఆఫీసర్స్ (కాంట్రాక్ట్) - 300
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 300 పోస్టులను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుండి 60% మార్కులతో ప్రధమ శ్రేణిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ /కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ(బీ. ఈ /బీ. టెక్ )కోర్సులను పూర్తి చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
30 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతలు అనగా బీ. ఈ /బీ. టెక్ మార్కులు మరియు అనుభవం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 నుండి 31,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
మరియు ఈ జీతంలతో పాటు ట్రావెల్ అలోవెన్స్ (TA) /డ్రాఫ్టింగ్ అలోవెన్స్ (DA) మరియు ఇతర బెనిఫిట్స్ ను కూడా లభించనున్నాయి.
తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here
8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here
0 Comments