తిరుమల తిరుపతి దేవస్థానములు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 915 ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన ఒక ప్రకటనను టీటీడి, పరిపాలన భవనం నుండి తాజాగా విడుదల అయినట్లుగా ఒక క్లిప్పింగ్ గడిచిన 24 గంటల నుండి సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తుంది.
గడిచిన రోజు నుండి సామాజిక మాధ్యమాలలో హడావిడి చేస్తున్న ఈ ప్రకటన పై తిరుమల తిరుపతి దేవస్థానం తమ స్పందనను తాజాగా ఒక ప్రకటన ద్వారా అధికారికంగా తెలియ చేసినది.
గత 24 గంటల నుండి సామాజిక మాధ్యామాలలో ప్రత్యక్షమవుతున్న టీటీడి ఉద్యోగాల భర్తీ పేరిట వస్తున్న ప్రకటన పూర్తిగా అవాస్తవం అని టీటీడీ బోర్డు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ అబద్దపు ప్రకటనను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని, ఎవరికీ కూడా డబ్బులు చెల్లించవద్దని టీటీడీ అధికారులు అభ్యర్థులకు తెలుపుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాల భర్తీ జరిగేటపుడు ముందుగా పేపర్ ప్రకటనల ద్వారా మరియు టీటీడీ అధికారిక వెబ్సైటు ద్వారా తెలియచేస్తామని టీటీడి అభ్యర్థులకు స్పష్టం చేసింది.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments