రైల్వే ఎన్టీపీసీ పరీక్షల ఫస్ట్ ఫేస్ పరీక్షలు వ్రాసిన ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభ్యర్థులకు ఒక స్వీట్ న్యూస్.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు,వారి వారి దరఖాస్తు ఫీజులు అతి త్వరలో రీ - ఫండ్ కానున్నాయి.
ఇప్పటికే ఇంగ్లీష్ అక్షరముల ఆల్ఫాబెట్స్ ఆర్డర్ లో అన్ని భారతీయ రైల్వే బోర్డులకు సంబంధించి పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులకు వరుసగా వారు చెల్లించిన దరఖాస్తు ఫీజులు వెనుకకు వారి వారి బ్యాంక్ అకౌంట్స్ లోనికి రీ - ఫండ్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ఈ రోజు లేదా మరో రెండు రోజుల లోపు ఈ రైల్వే ఎన్టీపీసీ పరీక్షల దరఖాస్తు ఫీజులు రీ - ఫండ్ వచ్చే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలకు 250 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించిన అభ్యర్థులకు రీ -ఫండ్ గా 240 రూపాయలు మరియు 500 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించిన అభ్యర్థులకు 390 రూపాయలు రీ - ఫండ్ గా వస్తున్నట్లు అభ్యర్థులు తెలుపుతున్నారు.
ఈ పరీక్షలు వ్రాసిన ఇరు తెలుగు రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు రానున్న రెండు రోజుల్లో వారి వారి అకౌంట్స్ లో ఈ దరఖాస్తు ఫీజులు రీ - ఫండ్ అవుతాయి కాబట్టి , వారి వారి బ్యాంక్ అకౌంట్స్ ను చెక్ చేసుకోవడం మంచిది అని మనం చెప్పుకోవచ్చు.
Union Bank లో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments