ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా తీసుకుని చేపడుతున్న కార్యక్రమం జగనన్న అమ్మ ఒడి పథకంపై ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఏపీ లో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని మరియు విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తున్న సంగతి మనందరికి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మ ఒడి పథకానికి అర్హతలు కలిగిన విద్యార్థిని, విద్యార్థుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలనీ ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రివర్యులు తాజాగా నిర్వహించిన విద్యా రంగం పైన చేసిన సమీక్షలో భాగంగా సంబంధిత విద్యా శాఖ అధికారులను ఆదేశించినట్లుగా వార్తలు అందుతున్నాయి.
ఈ అమ్మ ఒడి పధకం క్రింద విద్యార్థుల జాబితాలను అధికారులు సంసిద్ధం చేసిన వెంటనే ఏపీలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఖాతాలలోనికి 15,000 రూపాయలు నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనునట్లుగా తెలుస్తుంది.
అమ్మ ఒడి పథకం తో పాటు జగనన్న విద్యా కానుక క్రింద 1-10 వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, డిక్షనరీ, షూస్,యూనిఫామ్ లను కూడా రాబోయే విద్యా సంవత్సరం ముందుగానే,
వేసవి సెలవుల అనంతరం స్కూల్స్ తెరిచే నాటికీ ముందుగానే సంబంధిత పాఠశాలలకు చేర్చాలని ఈ సమావేశంలో ఏపీ విద్యా శాఖ మంత్రివర్యులు, సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది అని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ప్రభుత్వ స్కూల్ లో కాంట్రాక్ ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments