ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో వివిధ విభాగాలలో ఉద్యోగ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్న సుమారు 1.34 లక్షల మంది అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఒక గొప్ప శుభవార్త ను అందించారు.
ఏపీ స్టేట్ లో 2019 నుండి గ్రామ /వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగార్థులు రెండు సంవత్సరాలు ప్రోబేషనరీ పీరియడ్ ను గత సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. .
ఈ తరుణంలోనే, గ్రామ /వార్డ్ సచివాలయలలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 1.34 లక్షల మంది అభ్యర్థుల ప్రోబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసి,
ఈ ఏడాది 2022, జూన్ 30 వ తేది నుండి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణనలోనికి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేశారు.
ఏపీ సీఎం గారు జారీ చేసిన ఈ ప్రకటన ద్వారా 1.34 లక్షల గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగార్థులు జూలై నెల నాటికి రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మారనున్నారు.
వీటితో పాటు రెగ్యులర్ పే - స్కేల్ జీతమును మరియు ఇతర అలోవెన్స్ లు, మెడికల్ ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
ఏపీ సీఎం గారు చేసిన ఈ ప్రకటన పట్ల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ /వార్డ్ సచివాలయాలలో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు అందరూ తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments