Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bank Of Baroda Job Recruitment 2022 : పరీక్ష లేదు, బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఉద్యోగాలు లక్ష వరకు జీతం

బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న హ్యూమన్ రిసోర్స్ విభాగమునకు చెందిన వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు  :

1).  బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు. 

Bank Of Baroda Job Recruitment 2022

బ్యాంక్ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అర్హతలు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు. Bank Of Baroda Job Recruitment 2022

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బరోడా, పూణే, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చిన ఈ తాజా ఉద్యోగ సమాచారాన్ని మనం ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాము.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 7, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది      : జనవరి 27, 2022

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
హెడ్ - వెల్త్ స్ట్రాటజిస్ట్ 1
వెల్త్ - స్ట్రాటజిస్ట్ 28
ఇన్వెస్ట్ మెంట్ రీసెర్చ్ మేనేజర్ 2
పోర్ట్ ఫోలియో రీసెర్చ్ ఎనాలిస్ట్ 2
NRI వెల్త్ ప్రోడక్ట్స్ మేనేజర్ 1
ప్రోడక్ట్ మేనేజర్ 1
ట్రేడ్ రెగ్యులేషన్ -సీనియర్ మేనేజర్ 1
ప్రోడక్ట్ హెడ్ - ప్రయివేట్ బ్యాంకింగ్ 1
గ్రూప్ సేల్స్ హెడ్ 1
ప్రయివేట్ బ్యాంకర్స్ 20

మొత్తం ఉద్యోగాలు  :

58 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డు / యూనివర్సిటీ ల నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) / రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

23 నుండి 50 సంవత్సరాలు వయసు వరకూ కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు  :

ఓబీసీ / జనరల్ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ తదితర అంశాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విద్యా అర్హతలు మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ ను ఆధారంగా చేసుకుని ఆకర్షనీయమైన జీతములు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి. లక్ష వరకు జీతం ఉంటుంది. 

Apply Link

Website

Notification 

Post a Comment

0 Comments