గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏపీ మహిళ పోలీస్ (సబ్ - ఆర్డినేట్ సర్వీస్ ) స్పెషల్ రూల్స్ కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా జారీ అయినది.
ఈ అధికారిక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ హోమ్ డిపార్టుమెంటు తాజాగా విడుదల చేసినది.
ప్రకటనలో పొందుపరచబడిన అతి ముఖ్యమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
మహిళ పోలీస్ ప్రకటన - ముఖ్యంశాలు :
1). ఇకపై మహిళ పోలీస్ సర్వీస్ లను పోలీస్ డిపార్టుమెంటు లో స్పెషల్ క్యాడర్ గా పరిగణనలోనికి తీసుకోనున్నారు.
2). ఐదు కేటగిరీ లుగా ఆంధ్రప్రదేశ్ మహిళ పోలీస్ (సబ్ ఆర్డినేట్ సర్వీస్ ) లను విభజన చేయడం జరిగింది.
మహిళ పోలీస్ లు - కేటగిరీలు :
కేటగిరీ (1) : ఇన్స్పెక్టర్ (మహిళ పోలీస్ ) (నాన్ - గేజీటేడ్ )
కేటగిరీ (2) : సబ్ - ఇన్స్పెక్టర్ (మహిళ పోలీస్ )
కేటగిరీ (3) : అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళ పోలీస్ )
కేటగిరీ (4) : సీనియర్ మహిళ పోలీస్
కేటగిరీ (5) : మహిళ పోలీస్.
ప్రమోషన్స్ - వివరాలు :
ఒక మహిళ పోలీస్ సీనియర్ మహిళ పోలీస్ గా ప్రమోషన్ పొందవలెను అంటే 6 సంవత్సరాలు మినిమం సర్వీస్ ఉండవలెను.
ఒక సీనియర్ మహిళ పోలీస్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళ పోలీస్ ) గా ప్రమోషన్ పొందాలి అంటే మినిమం 5 సంవత్సరాలు సర్వీస్ ను పూర్తి చేసి ఉండవలెను అని ప్రకటనలో తెలిపారు.
ఒక అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (మహిళ పోలీస్ ) ఎస్ఐ గా ప్రమోషన్ పొందాలి అంటే 5 సంవత్సరాలు సర్వీస్ ను పూర్తి చేయవలెను.
ఒక ఎస్ఐ ( మహిళ పోలీస్ ), ఇన్స్పెక్టర్ ( మహిళ పోలీస్ ) (నాన్ - గేజీటెడ్ ) గా ప్రమోషన్ పొందాలి అంటే ఐదు సంవత్సరాలు సర్వీస్ ను పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళ పోలీసులు అందరూ ఈ ప్రకటనలో పొందుపరిచిన ఇతర ముఖ్యమైన అంశాలను ఈ క్రింది నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
రైల్వే గ్రూఫ్-డి పరీక్ష వాయిదా పడుతుందా ? Click Here
0 Comments