బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన క్యాష్ మేనేజ్ మెంట్ డిపార్టుమెంటు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన పోస్టుల భర్తీ విషయాలను సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. Bank of Baroda Job Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 1, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( అక్విసిషన్ & రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ ) - 50
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ( ప్రోడక్ట్ మేనేజర్ ) - 3
మొత్తం పోస్టులు :
53 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / డిప్లొమా ఇన్ మేనేజ్ మెంట్ (మినిమం రెండేళ్ల కోర్సు) / సీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అక్విసిషన్ & రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ విభాగంలో భర్తీ చేయనున్న అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బీఈ/ బీటెక్ / ఎంసీఏ/సీఏ/ఎంబీఏ/పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రోడక్ట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
25 నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10-15 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ / ews కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలను మరియు ఎస్సీ /ఎస్టీ / దివ్యంగుల కేటగిరిలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ను ధరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూ / ఇతర సెలక్షన్ మెథడ్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా ఆకర్షనీయమైన జీతములు లభించనున్నాయి.
సంవత్సరమునకు 11 లక్షల రూపాయలు నుండి 18 లక్షల రూపాయలు మధ్య జీతములు లభించే అవకాశములు ఉన్నాయి.
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments