ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నగరం విశాఖపట్నం, నక్కపల్లి లో ఉన్న ప్రముఖ సంస్థ హేటేరో లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 700 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యంశాలు :
1). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
2). పరీక్షల నిర్వహణ లేదు.
3). APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల నిర్వహణ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.
ఏపీఎస్ఎస్డిసీ ఆధ్వర్యంలో కల్పించే ఈ పోస్టులను పేర్మినెంట్ గ చేసుకునే అవకాశం కూడా కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నక్కపల్లి - విశాఖపట్నం నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
హేటేరో సంస్థలో భర్తీ చేయనున్న ఈ 700 పోస్టుల భర్తీ కి నిర్వహించబోయే స్కిల్ డ్రైవ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహాణ తేదీ : జనవరి 24, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
పీ. ఆర్. డిగ్రీ కాలేజీ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రొడక్షన్ - 200
Qc/Qa/R&D - 100
TSD - 50
మెయింటైనెన్స్ / సేఫ్టీ - 150
ఇంజనీరింగ్ /EHS-ETP - 200
మొత్తం పోస్టులు :
700 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీ. ఎస్సీ (కెమిస్ట్రీ ), బీ.కాం మరియు బీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ప్రొడక్షన్ డిపార్టుమెంటు పోస్టులకు,
ఎం. ఎస్సీ ( ఆర్గానిక్ /అనాలిటికల్), బీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు Qc/Qa/R&D పోస్టులకు,
బీ. టెక్ ( కెమికల్ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు TSD పోస్టులకు,
డిప్లొమా ( మెకానికల్ / ఎలక్ట్రికల్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు మెయింటైనెన్స్ / సేఫ్టీ విభాగంలో ఉద్యోగాలకు,
ఐటీఐ - అప్ప్రెంటీస్ ( ఫిట్టర్ / ఎలక్ట్రికల్ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ /EHS-ETP పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
2017 - 2022 సంవత్సరాలలో ఆయా కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలుపడం జరిగింది.
వయసు :
27 సంవత్సరాలు లోపు వయసు ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చని ప్రకటనలో తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 2, 19,000 రూపాయలు వరకూ జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
8688977277
9988853335
@AP_Skill has Conducting Pool Campus Drive for @heteroofficial at PR Degree College #Kakinada @egodavarigoap
— AP Skill Development (@AP_Skill) January 21, 2022
Job Location: #Nakkapalli @vizaggoap
Registration Link:https://t.co/l4w70zGZ6C pic.twitter.com/lSuE5YBTbl
0 Comments