Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal GDS 2022 Notification Date : రైల్వే పోస్టల్ GDS నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది??

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కేవలం 10వ తరగతి మాత్రమే అర్హతలుగా, ఉన్న సొంత ఊరిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే ఒకే ఒక అవకాశం పోస్ట్ ఆఫీస్ కల్పిస్తుంది.

పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పేరుతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM) మరియు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) అనే రెండు కేటగిరీ ల ఉద్యోగాలను ఇరు తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి చదువుతున్న అభ్యర్థులకు గత నాలుగు సంవత్సరాలు నుండి ఇండియన్ పోస్టల్ డిపార్టుమెంటు కల్పిస్తుంది.

Postal GDS 2022 Notification Date

ఈ మేరకు గడిచిన 2018, 2019 మరియు 2020 సంవత్సరాలులో మూడు దశలలో (సైకిల్స్) లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పోస్ట్ ఆఫీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ ను ఇండియన్ పోస్ట్ డిపార్టుమెంటు నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. Postal GDS 2022 Notification Date

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం 10వ తరగతి విద్యా అర్హతలో అభ్యర్థులు సాధించిన మెరిట్ మార్కులను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఈ పోస్టుల ప్రత్యేకత.

గత మూడు సంవత్సరాల నుండి వచ్చిన పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్స్ మరియు భర్తీ చేసిన ఖాళీల వివరాలను మనం ఒకసారి తెలుసుకుందాం.

2018 పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ - ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్  - 2286 పోస్టులు. 

తెలంగాణ   - 1058 పోస్టులు.

2019 పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ - ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్   -  2707 పోస్టులు.

తెలంగాణ    -   970 పోస్టులు.

2020-21 పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ - ఖాళీలు  :

ఆంధ్రప్రదేశ్   -  2296 పోస్టులు.

తెలంగాణ     - 1150 పోస్టులు.

పోస్టల్ జీడీఎస్ - 2022 నోటిఫికేషన్ వస్తుందా…?

గత మూడు సంవత్సరాలు నుండి ఇరు తెలుగు రాష్ట్రాలలో వరుసగా పోస్టల్ డిపార్టుమెంటు కు సంబంధించిన గ్రామీన్ డాక్ సేవక్ (BPM & ABPM) పోస్టులను భర్తీ చేయడం మనం పైన ఇచ్చిన గణంకాలను బట్టి తెలుసుకోవచ్చు.

ఈ తరుణంలోనే జనవరి 13, 2022 వ తేదీన 2020-21 కు సంబంధించిన ఏపీ మరియు టీఎస్ జీడీఎస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.

అయితే ఈ ఫలితాలలో ఇరు తెలుగు రాష్ట్రాలలో కొన్ని పోస్టులను విత్ హెల్డ్ లో ఉంచడం జరిగింది. ఆయా ప్రాంతాలలో రిజర్వేషన్స్ పరంగా అర్హతలు గల అభ్యర్థులు లేనందువల్ల ఆయా పోస్టుల భర్తీ పెండింగ్ లో ఉండడం మనం గమనించవచ్చు.

అయితే, ఏపీ మరియు టీఎస్ స్టేట్స్ లో ఈ విత్ హెల్డ్ లో ఉంచిన పోస్టులకు మరియు గత సంవత్సరం నుండి రిటైర్ మెంట్స్ వల్ల పోస్టల్ జీడీఎస్ డిపార్టుమెంటు లో ఏర్పడిన ఖాళీలను కలిపి రాబోయే మూడు, నాలుగు నెలల లోపు 2022 సంవత్సరానికి సంబంధించిన జీడీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్   (ప్రకటన) విడుదలయ్యే అవకాశం కలదు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎపుడు నోటిఫికేషన్ విడుదల అయినా సరే ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు మన telugucompetitive.com వెబ్సైటు ద్వారా మీకు సమాచారం అందిస్తాము. కావున అభ్యర్థులు అందరూ ప్రతీరోజు మన సైట్ ను ఫాలో అవ్వగలరు.

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here 

Post a Comment

0 Comments