గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి రైల్వే ఎన్టీపీసీ (నాన్ - టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టుల భర్తీకి జారీ చేసిన CEN - 01/2019 నోటిఫికేషన్ కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
భారతీయ రైల్వే లో ఎన్టీపీసీ కేటగిరీ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 35,281 పోస్టుల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను ఈ ప్రకటనలో వివరించారు.
అన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ చేసిన వారందరు అర్హులే అని, ఈ పోస్టులలో 10+2 అర్హతలు కలిగిన వారు 10,603 పోస్టులకు అర్హతలు సాధించారని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తెలిపింది.
ఇటీవలే రైల్వే ఎన్టీపీసీ సీబీటీ - 1 పరీక్షల ఫలితాలను విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా జారీ చేసిన ఈ ప్రకటనలో ఏ లెవెల్ ఎన్టీపీసీ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసారో అధికారికంగా రైల్వే శాఖ తెలిపింది.
పే లెవెల్ 7th సీపీసీ ప్రకారం:
2nd లెవెల్ లో మొత్తం 5,663 ఖాళీలు ఉండగా 1,13,301 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.
3rd లెవెల్ లో మొత్తం 4,940 ఖాళీలు ఉండగా 98,833 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది.
4th లెవెల్ లో మొత్తం 161 ఖాళీలు ఉండగా 3,223 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది.
5th లెవెల్ లో మొత్తం 17,393 పోస్టుల ఖాళీలు ఉండగా 3,47,676 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది.
6th లెవెల్ లో మొత్తం 7,124 పోస్టుల ఖాళీలు ఉండగా 1,42,413 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది.
మొత్తంగా 35,281 రైల్వే ఎన్టీపీసీ పోస్టులకు మొత్తం 7,05,446 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది.
0 Comments