రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూజియం, కొలకత్తా నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ ప్రకటనలో ముఖ్యంశాలను మనం ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.
ముఖ్యాంశాలు:
1). ఇవి గ్రేడ్ ఏ మరియు గ్రేడ్ బీ స్థాయి ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.
3). ఫుల్ టైమ్ కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
4). భారీ స్థాయిలో జీతములు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఆర్బీఐ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 4, 2022
ఎగ్జామ్స్ నిర్వహణ తేది : మార్చి 6, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ | 2 |
మేనేజర్ ( టెక్నికల్ - సివిల్ ) | 6 |
మేనేజర్ ( టెక్నికల్ - ఎలక్ట్రికల్ ) | 3 |
లైబ్రరీ ప్రోఫెషనల్స్ ( అసిస్టెంట్ లైబ్రరీయన్ ) ఇన్ గ్రేడ్ - ఏ | 1 |
ఆర్చిటెక్ట్ ఇన్ గ్రేడ్ - ఏ | 1 |
క్యూరేటర్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ ఫర్ ఆర్బీఐ, కోల్కత్త | 1 |
మొత్తం ఖాళీలు :
14 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / కాలేజ్ / ఇన్స్టిట్యూషన్ల నుండి బ్యాచ్ లర్ డిగ్రీ ఇన్ లా / మాస్టర్ డిగ్రీ ఇన్ లా /బాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ / బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ) / బాచిలర్ డిగ్రీ ఇన్ (ఆర్ట్స్ /కామర్స్ /సైన్స్ )/ మాస్టర్ డిగ్రీ ఇన్ (లైబ్రరీ సైన్స్ /లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ )/ బాచిలర్ డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ (హిస్టరీ /ఎకనామిక్స్ /ఫైన్ ఆర్ట్స్ /ఆర్కియాలజీ /మ్యూజియలజీ /నూమిస్ మేటిక్స్ ) కోర్సులు పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీ లను అనుసరించి 56 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ / EWS కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ / ఎస్టీ / దివ్యంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు :
ఆఫ్ లైన్ పరీక్షలు మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష కేంద్రాల ఎంపిక :
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు పరీక్షలను హైదరాబాద్ నగరంలో వ్రాసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు గమనించగలరు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి గ్రేడ్ ఏ ఆఫీసర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 44,500 రూపాయలు నుండి 90,100 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
మరియు గ్రేడ్ బీ ఆఫీసర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 55,200 రూపాయలు నుండి 1,16,684 రూపాయలు వరకూ జీతం అందనుంది.
యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు Click Here
0 Comments