గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ & బ్రాడ్ కాస్టింగ్ కు చెందిన మినీరత్న కంపెనీ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టేంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 500 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.
3). కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
బీఈసీఐఎల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. BECIL Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జనవరి 25, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
ఇన్వెస్టిగేటర్స్ - 350
సూపర్ వైజర్స్ - 150
మొత్తం పోస్టులు :
500 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో పొందుపరిచారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి, కంప్యూటర్స్ పై గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రీజనల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ మరియు సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
50 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ( వయసు పరిమితి సడలింపు ) ఉండే అవకాశం కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు అభ్యర్థులు తమ తమ అప్లికేషన్స్ నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్/ఓబీసీ కేటగిరీ/ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలను, ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగుల కేటగిరీ లకు చెందిన అభ్యర్థులు 350 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
అవసరం మేరకు వ్రాత పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు ప్రకటనలో పొందుపరిచారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 24,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
Apply E- mail Address
projecthr@becil.com
0 Comments