గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫెలో షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు
2). కేవలం 20 రోజుల లోపే పోస్టుల భర్తీ
3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ విధానం
4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తులకు అర్హులే.
5). భారీ స్థాయిలో జీతములు.
ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati Jobs Recruitment 2022
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఐజర్ నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు : జనవరి 20, 2022 & జనవరి 23, 2022.
ఆన్లైన్ వర్చ్యువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : జనవరి 23, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ - డాక్టరల్ రీసెర్చ్ ఫెలో (PDRF) - 1
జూనియర్ రీసెర్చ్ ఫెలో / ప్రాజెక్ట్ అసోసియేట్ - 2
మొత్తం పోస్టులు :
మొత్తం 3 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎం. ఎస్సీ (కెమిస్ట్రీ )/పీ. హెచ్డీ డిగ్రీ (బయో ఇన్ ఆర్గానిక్/కో - ఆర్డినేషన్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ /ఆర్గానిక్ కాటలిసిస్ /థియరీటికల్ కెమిస్ట్రీ ) కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు గేట్ /నెట్ పరీక్షలలో ఉత్తిర్ణత చెంది ఉండి, సంబంధిత విభాగాలలో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
విభాగాలను అనుసరించి 28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,000 రూపాయలు నుండి 47,000 రూపాయలు వరకూ జీతం, మరియు 8% హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లు లభించనున్నాయి.
Link 2
gopi@labs.iisertirupati.ac.in
0 Comments