గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కర్నూల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి రాష్ట్ర ప్రభుత్వ విభాగానికి చెందిన పోస్టులు.
2). ఇవి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ బేసిస్ పోస్టులు.
3). గౌరవ స్థాయిలో వేతనాలు.
4). నాన్ - లోకల్ జిల్లా అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే వీలు కలదు.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కర్నూల్ జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
DMHO, కర్నూల్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : ఫిబ్రవరి 7, 2022 (5PM).
ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఫిబ్రవరి 9, 2022
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : ఫిబ్రవరి 15, 2022
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ తేది : ఫిబ్రవరి 16, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
స్టాఫ్ నర్స్ | 3 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 1 |
లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ | 1 |
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ -II) | 6 |
మొత్తం పోస్టులు :
11 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తులు చేయాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, వన్ ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ /బీఎస్సీ (నర్సింగ్ )/ జీఎన్ఎం కోర్సు/ఒక సంవత్సరం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు /రెండు సంవత్సరాల DMLT కోర్సులు /పీజీ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ క్రింది చిరునామాకూ నిర్ణిత గడువు చివరి తేది లోగా అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను డైరెక్ట్ గా అందజేయవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు మరియు మిగిలిన కేటగిరీ అభ్యర్థులు అందరూ 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
విద్యా అర్హతలు మార్కులు, సర్వీస్ మరియు కోర్సు వెయిటేజ్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకూ నెలకు జీతంగా 12,000 రూపాయలు నుండి 22,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ) :
DM&HO,
కర్నూల్,
ఆంధ్రప్రదేశ్.
0 Comments