జీతం 63,840 రూపాయలు వరకూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో ఆఫీసర్స్ ఉద్యోగాలు, రెగ్యులర్ బేసిస్ లో పోస్టుల భర్తీ, అస్సలు మిస్ కావద్దు.
భారత్ లో ప్రముఖ దిగ్గజ బ్యాంక్ లలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా ఎస్బీఐ బ్యాంక్ తాజాగా తెలిపింది.
ముఖ్యాంశాలు:
1).రెగ్యులర్ బేసిస్ లో పోస్టుల భర్తీ.
2).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
3).భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. SBI Job Recruitment 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఫిబ్రవరి 5, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 25, 2022
ఆన్లైన్ టెస్ట్ నిర్వహణ తేది : మార్చి 20, 2022
కాల్ లెటర్ డౌన్లోడ్ తేది : మార్చి 5, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ మేనేజర్ ( నెట్ వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ) - 15
అసిస్టెంట్ మేనేజర్ ( రూటింగ్ & స్విచింగ్ ) - 33
మొత్తం పోస్టులు :
48 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాల వారీగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో అనగా ఫస్ట్ డివిజన్ లో ఏదైనా విభాగంలో బాచిలర్ డిగ్రీ (ఫుల్ టైమ్ ) కోర్సులను పూర్తి చేయవలేను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
40 సంవత్సరాల వరకూ వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలేను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 36,000 రూపాయలు నుండి 63,840 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments