ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్ధం, గ్రూప్ -1, గ్రూప్ - 2 పోస్టుల సంఖ్య పెరుగుతాయి, పోలీస్ మరియు మెడికల్ విభాగాలలో పోస్టుల భర్తీకి కూడా సన్నాహాలు, భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య ఇలా ఉండబోతుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త ను అందించింది.
అందుబాటులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ పోస్టులలో ప్రధానంగా గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టులను సాధ్యమైనంత ఎక్కువగా భర్తీ చేయడానికి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళికలు రచిస్తుంది.
మరోవైపు ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్స్ కు సంబంధించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేసి నియామకాలను పూర్తి చేయడానికి ఏపీపీఎస్సీ కసరత్తులు చేస్తుంది.
గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 పోస్టులను పోస్టుల సంఖ్యను పెంచడంతో పాటుగా పోలీస్ విభాగంలో ప్రతీ సంవత్సరం 6,500 పోస్టుల భర్తీని చేయాలనీ ఇటీవలే పోలీస్ విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ ఆదేశాలను జారీ చేశారు.
ఏపీ లో త్వరలో విడుదల కానున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్ ఈ క్రింది విధంగా ఉండబోతున్నాయి.
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| ఏసీఎఫ్ పోలీస్ విభాగం | 9 |
| టెక్నికల్ అసిస్టెంట్ (గ్రౌండ్ వాటర్ ) | 4 |
| ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ | 8 |
| టౌన్ ప్లానింగ్ ఓవర్ సీర్ | 2 |
| జూనియర్ ట్రాన్స్ లేటర్ | 1 |
| అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్ | 3 |
| ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ | 8 |
| శాంపిల్ టేకెర్స్ మెడికల్ | 12 |
| అసిస్టెంట్ కెమిస్ట్ ( గ్రౌండ్ వాటర్ ) | 1 |
| అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ | 3 |
| అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ | 4 |
| అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ | 1 |
| జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ | 6 |
| ఏఈఈ | 29 |
| గ్రూప్ - 4 పోస్టులు (క్యారీ ఫార్వర్డ్ ) | 6 |
| జూనియర్ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ | 10 |
| డిగ్రీ లెక్చరర్ ఏపీఆర్ఈఐ సొసైటీ | 5 |
| ఇంగ్లీష్ రిపోర్టర్ (లేజీస్లీచర్ ) | 10 |
| కంప్యూటర్ డ్రాఫ్ట్స్ మెన్ | 8 |
| గ్రూప్ - 1 సర్వీస్ (సంఖ్య పెరుగుతుంది) | 31 |
| గ్రూప్ - 2 సర్వీస్ (సంఖ్య పెరుగుతుంది) | 30 |
| అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ | 17 |
| డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ | 240 |
| ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ | 8 |
| డిస్ట్రిక్ట్ ప్రోబేషన్ ఆఫీసర్స్ | 2 |
ప్రస్తుతానికి పైన వివరించిన మొత్తం పోస్టుల సంఖ్య 458 గా ఉంది. అయితే, పైన తెలిపిన వివిధ ప్రభుత్వ విభాగాలలో భర్తీ కానున్న పోస్టుల సంఖ్యను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈ పోస్టుల సంఖ్య మరింత పెరగనున్నట్లుగా తెలుస్తుంది.
ఇ రోజు వచ్చిన అన్ని ఉద్యోగాలు Click here
0 Comments