ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) సంస్థలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోస్టులు.
2). ఎటువంటి పరీక్షలు లేవు.
3). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ జరుగనుంది.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ విజయవాడ నగరంలో కూడా పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఏపీఎండీసీ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపుటకు చివరి తేది : మార్చి 1, 2022 ( 5PM ).
విభాగాల వారీగా ఖాళీలు :
| పోస్ట్ లు | ఖాళీలు |
|---|---|
| డిప్యూటీ జనరల్ మేనేజర్ ( లీగల్ ) | 1 |
| డిప్యూటీ జనరల్ మేనేజర్ ( మైనింగ్ ) | 1 |
| డిప్యూటీ జనరల్ మేనేజర్ ( F & A ) | 1 |
| డిప్యూటీ జనరల్ మేనేజర్ ( మైనింగ్ ) | 1 |
మొత్తం పోస్టులు :
నాలుగు పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి డిగ్రీ ఇన్ లా / డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ / డిగ్రీ విత్ సీఏ మొదలైన కోర్సులు పూర్తి చేసి డీజీఎంఎస్ నుండి సర్టిఫికెట్స్ ను కలిగి ఉండవలెను.
సంబంధిత సబ్జెక్టు విభాగాలలో కంప్యూటర్ నాలెడ్జ్ మరియు అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు. APMDC Jobs 2022 Recruitment
వయసు :
50 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు :
ఇంటర్వ్యూ విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 51,000 రూపాయలు నుండి 70,000 రూపాయలు వరకూ జీతం మరియు 25,000 రూపాయలు వరకూ ఇతర అలోవెన్స్ ల రూపంలో లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన ఈ - మెయిల్ అడ్రస్ :
apmdchrdrecruitments@gmail.com
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
THE ANDHRA PRADESH MINERAL DEVELOPMENT CORPORATION LIMITED,
294/1D, Tadigadapa to Enikepadu 100 Ft. Road,
Kanuru Village, Penamaluru Mandal,
Vijayawada - 521137.
ఇ రోజు వచ్చిన అన్ని ఉద్యోగాలు Click here
0 Comments