ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు లో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పోస్టుల భర్తీ విధానంలో పలు కీలక సంస్కరణలు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
ఏపీలో రాబోయే రోజుల్లో జరిగే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే అన్ని పోస్టుల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుపడానికి వీలుగా ఈ క్రింది విధానాలు చేపట్టనున్నారు.
గ్రూప్ - 1 పోస్టులతో సహా మిగిలిన అన్ని విభాగాల పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు రద్దు చేస్తున్నట్లు, పరీక్షల నిర్వహణ అనంతరం అభ్యర్థుల పరీక్ష పత్రాలను డిజిటల్ పద్దతిలో మూల్యంకనం చేపట్టనున్నట్లు,
మెయిన్స్ పరీక్షల నిర్వహణలో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల విధానంను ప్రవేశపెట్టడం,
రిజర్వ్డ్ మెరిట్ అభ్యర్థులకు కూడా ఓపెన్ కేటగిరీ పోస్టులు కేటాయించడం, మరియు వెనుకబడిన EWS కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేక కోటా క్రింద కూడా పోస్టుల సంఖ్యను కూడా కేటాయించడం లాంటి పలు కీలక సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) చేపట్టినది అని కమిషన్ సభ్యులు తెలుపుతున్నారు. APPSC Jobs Update 2022
మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు కల్పిస్తున్న వయో పరిమితి సడలింపును 2026 మే 31 వరకూ ప్రభుత్వం పెంచినట్లుగా కమిషన్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే గ్రూప్ - 1, గ్రూప్ - 2 మొదలైన పోస్టుల భర్తీ ప్రక్రియలో వచ్చిన దరఖాస్తుల (అప్లికేషన్స్ ) సంఖ్యను బట్టి, అత్యధిక సంఖ్యలో అప్లికేషన్స్ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని,
ఒక వేళ అప్లికేషన్స్ సంఖ్య అతి తక్కువగా వస్తే ఆయా ఉద్యోగాల భర్తీలో ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసి, కేవలం ఒకే ఒక పరీక్ష ద్వారా ఉద్యోగాల నియామకాలను చేపడుతామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సభ్యులు తాజాగా తెలిపారు.
APMDC లో ఉద్యోగాలు, విజయవాడలో పోస్టింగ్స్, జీతం 70,000 రూపాయలు Click Here
0 Comments