Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Bank Of Maharashtra Jobs Recruitment 2022 : జీతం 78,230 రూపాయలు వరకూ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.

హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న  పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్స్ (స్కేల్ II&III) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన వెలువడినది.

ముఖ్యంశాలు  :

1). వీటిని రెగ్యులర్ ఉద్యోగాలుగా పరిగణించవచ్చు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీస్థాయిలో పోస్టులు భర్తీ మరియు వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Bank Of Maharashtra Jobs Recruitment 2022

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Bank Of Maharashtra Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు :

పోస్ట్ లు తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది ఫిబ్రవరి 5, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 22, 2022
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది మార్చి 12, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ తేది త్వరలో ప్రకటిస్తారు

విభాగాల వారీగా ఖాళీలు  :

జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ - II)    -      400

జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్ - III)   -       100

మొత్తం పోస్టులు :

500 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాల వారీగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డు ల నుండి ఏదైనా విభాగాలలో 60% లేదా 55% మార్కులతో బాచిలర్ డిగ్రీ కోర్సులను /సీఏ/సీఎంఏ/సీఎఫ్ఏ మొదలైన కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

కేటగిరీలను అనుసరించి 25 నుండి 38 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 15 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

యూఆర్/ews/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1180 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 118 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

దివ్యంగులు మరియు అన్ని కేటగిరిలకు చెందిన మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ నిర్వహణల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 48,170 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Apply Link

Website

Notification

Post a Comment

0 Comments