సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న సుమారు 313 మైనింగ్ సిర్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ విభాగానికి చెందిన గ్రూప్ -సీ పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
3). డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
కోల్ ఇండియా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Coalfield Jobs Recruitment 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఫిబ్రవరి 20, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మార్చి 10, 2022
ఉద్యోగాలు - వివరాలు :
మైనింగ్ సిర్దార్ - 313
విభాగాల వారీగా ఖాళీలు :
జనరల్ - 127
EWS - 30
ఓబీసీ - 83
ఎస్సీ - 46
ఎస్టీ - 23
బ్యాక్ లాగ్ (ఎస్టీ ) - 4
మొత్తం పోస్టులు :
313 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10+2 అర్హతగా కలిగి మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ /డిప్లొమా కోర్సులను పూర్తి చేసి , డీజీఎంఎస్ నుండి మైనింగ్ సిర్దార్ షిప్ సర్టిఫికెట్ /వాలీడ్ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్ మరియు వాలీడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను నోటిఫికేషన్ లో పొందుపరచలేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతలు మరియు టెస్టుల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 31,852.56 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments