భారతీయ రైల్వేలో కేంద్ర ప్రభుత్వ రైల్వే పోస్టులను ఇప్పిస్తామని నిరుద్యోగ అభ్యర్థుల నుండి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లుగా చిత్తూరు జిల్లా డీఎస్పీ గారు ఒక ముఖ్యమైన ప్రకటనను తాజాగా చేశారు.
ఇటీవలే రైల్వే ఉద్యోగాలను ఇప్పిస్తాను అని రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల నుండి సుమారుగా కోటి రూపాయలు పైన వసూలు చేసి,
మోసం చేసిన వారిని అదుపులోనికి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా డీఎస్పీ ఒక అధికారిక ప్రకటన ద్వారా మీడియా కు తెలిపారు.
రైల్వే లో డ్రైవర్ పోస్టులను ఇప్పిస్తాను అంటూ ఒక అభ్యర్థి నుండి 4.5 లక్షలు, అటెండర్ పోస్టును ఇప్పిస్తానని మరో అభ్యర్థి నుండి మరో 14 లక్షల రూపాయలు తీసుకుని అభ్యర్థులను మోసం చేసిన వ్యక్తిని అదుపులోనికి తీసుకుని.
విచారణ చేశామని, ఈ విచారణలో సదరు వ్యక్తి అభ్యర్థులను మోసగించిన మాట వాస్తవం అని ఒప్పుకున్నాడని చిత్తూరు జిల్లా డీఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగాలను భారతీయ రైల్వే అత్యంత పారదర్శకముగా భర్తీ చేస్తుందని,
దయచేసి రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు ఎవ్వరూ కూడా రైల్వే పోస్టుల కోసం ఎవ్వరికి డబ్బులను చెల్లించి మోసపోవద్దని డీఎస్పీ ఈ ప్రకటన ద్వారా తెలిపారు.
కాకినాడ లో ఉద్యోగాలు Click Here
0 Comments