పరీక్ష లేదు, వైజాగ్ మరియు హైదరాబాద్ ECIL లో ఉద్యోగాలు, జీతం 55,000రూపాయలు వరకూ, అస్సలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైస్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), హైదరాబాద్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును
పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్, ముంబై నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Vizag and Hyderabad ECIL Jobs 2022
ఈసీఐఎల్ నుండి తాజాగా వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఫిబ్రవరి 15, 2022.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేది : ఫిబ్రవరి 15, 2022.
ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయం : 9AM to 4PM.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నలంద కాంప్లెక్స్, CLDC,TIFR రోడ్, హైదరాబాద్-500062.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ ( ECE/EEE/ETE ) - 6
మరియు ఇంజనీర్స్ ( MECH/ECE/CSE) - 6
మొత్తం పోస్టులు :
12 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ప్రధమ శ్రేణిలో ECE/EEE/ETE/MECH/ECE/CSE విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ అనగా బీ.ఈ /బీ. టెక్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
33 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కూడా కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ క్రింది వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపి తదుపరి విద్యా ద్రువీకరణ పత్రాలను జతపరిచి ఇంటర్వ్యూ నిర్వహణ సమయంలో తమకూడా తీసుకుని వెళ్ళవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం ఇంటర్వ్యూ విధానము ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 40,000 రూపాయలు నుండి 55,000 రూపాయలు వరకూ జీతం మరియు 12,000 రూపాయలు వరకూ మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
0 Comments