ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కోర్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నుండి ఒక ప్రకటన విడుదల అయినది, ఈ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు.
ఆసక్తి మరియు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రకటనలో తెలిపారు.
తాజాగా వచ్చిన ఈ చిత్తూరు జిల్లా కోర్ట్ పరిధిలోని ఉద్యోగ అవకాశాలు గురించి మనం ఇప్పడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యంశాలు :
దరఖాస్తులను సమర్పించుటకు చివరి తేది : ఈ నెల 15, 2022. ( సాయంత్రం 5 గంటల లోపు ).
దరఖాస్తులను అందించవలసిన అడ్రస్ :
హై రోడ్, జిల్లా న్యాయ సేవాసాధికార సదన్ కార్యాలయం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. AP Court Jobs Update 2022
పోస్టులు - వివరాలు :
ఫ్రంట్ ఆఫీస్ కో - ఆర్డినేటర్
అర్హతలు :
కంప్యూటర్ లో పీజీడిసీఏ, డిసీఏ కోర్సులతో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లో హయ్యర్ ఉత్తీర్ణత చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
2021 సెప్టెంబర్ 1వ తేది నాటికీ 18-42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Comments