ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది, ఏపీ ఇంటర్ బోర్డు తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల రీ షెడ్యూల్ ను విడుదల చేసినది.
గత నెలలో ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 16 నుండి 21 వ తేది వరకూ నిర్వహిస్తామని విద్యార్థులకు ఎగ్జామ్స్ టైం టేబుల్ తో కూడిన షెడ్యూల్ ను విడుదల చేయగా,
తాజాగా ఏప్రిల్ 16-21 వ తేదిల వరకూ జేఈఈ పరీక్షలు జరుగుతుండడంతో, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలలో మార్పులు చేస్తూ తాజాగా ఏపీ ఇంటర్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు : ఏప్రిల్ 22, 2022 - మే 11, 2022.
ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల తేదీలు : ఏప్రిల్ 23, 2022 - మే 12, 2022
పరీక్షల నిర్వహణ సమయం :
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలు వ్రాయబోయే విద్యార్థులు ఈ క్రింది లింక్ ద్వారా మీ మీ పరీక్షల షెడ్యూల్ ను తెలుసుకోవచ్చు.
0 Comments