అధికారిక వెబ్‌సైట్ లో చాలా రోజుల తరువాత TTD నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. పరీక్ష లేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు, జీతం 29,980 - 54,060 రూపాయలు వరకూ, అస్సలు మిస్ కావద్దు, పూర్తి వివరాలను ఇప్పుడే చూడండి.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, తిరుపతి లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి టీటీడీ బోర్డ్ కు సంబంధించిన ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో తెలిపారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 11, 2022 (5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
ఫార్మ్ మేనేజర్ /గోశాల మేనేజర్ - 3
కాంపౌండర్ /డైరీ అసిస్టెంట్ - 6
మొత్తం పోస్టులు :
9 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి వెటర్నరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఫార్మ్ మేనేజర్ /గోశాల మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.వెటర్నరీ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని ఈ ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి మరియు ఏపీ అనిమల్ హస్బెండరి డిపార్టుమెంటు లేదా ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీల నుండి రెండు సంవత్సరాల అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ కాంపౌండర్ /డైరీ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ తమ దరఖాస్తు ఫారం లను సరైన వివరాలతో నింపి, తదుపరి అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ (చిరునామా) కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా విద్యా అర్హతల మెరిట్ / ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఫార్మ్ మేనేజర్ / గోశాల మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 54,060 రూపాయలు జీతం అందనుంది.
మరియు కాంపౌండర్ / డైరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 29,980 రూపాయలు లభించనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
The Director,
S. V. Gosamrakshana Trust, TTD,
Chandragiri Road, Tirupati - 517502,
Chittoor (District ), Andhra Pradesh.
సంచాలకుల వారి కార్యాలయం,
శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, చంద్రగిరి రోడ్,
తిరుపతి - 517502.
తిరుపతి లో ఉద్యోగాలు మరెన్నో ఉద్యోగాలు Click Here

0 Comments