Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati 30,000 Salary Jobs : తిరుపతి లో కొత్త జాబ్స్ అస్సలు మిస్ కాకండి

పరీక్ష లేదు, తిరుపతి లో 189 ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 50,000 రూపాయలు వరకూ, నెల రోజుల్లో ఉద్యోగం, వెంటనే అప్లై చేసుకోండి.

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉన్న ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లా, తిరుపతి నగరంలో ఉన్న SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ లలో

వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 180 కి పైన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు   :

1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

2). భారీ స్థాయిలో జీతములు.

3). 5వ,7వ,10వ తరగతుల విద్యా అర్హతలతో కూడా ఉద్యోగాల భర్తీ.

4). వీటిని కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.

5). ఒక నెల రోజుల లోపులోనే పోస్టుల భర్తీ.

అతి తక్కువ విద్యా అర్హతల నుండి డిగ్రీ కోర్సుల విద్యా అర్హతలతో మరియు ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలను 80 % లోకల్ అభ్యర్థులతో మరియు 20% నాన్ - లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. కావున నాన్ - లోకల్ అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం కేవలం నెల రోజుల్లో అనగా జనవరి నెలలోనే ఈ ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు. Tirupati 30,000 Salary Jobs

ఇటీవలే విడుదలైన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన అతి ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేది   : డిసెంబర్ 15, 2021

మెరిట్ లిస్ట్ విడుదల తేది : డిసెంబర్ 30, 2021

ఫైనల్ మెరిట్ లిస్ట్ & సెలక్షన్ లిస్ట్ విడుదల తేది : జనవరి 5, 2022

ఆర్డర్స్ విడుదల తేది   :   జనవరి 10, 2022

సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాయినింగ్ తేది  : జనవరి 17,2022

విభాగాల వారీగా ఖాళీలు   :

SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి :

పోస్ట్‌లు ఖాళీలు
ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ - II) 17
ఫార్మసీస్ట్ (గ్రేడ్ - II) 14
ఫిజిసిస్ట్ / న్యూక్లియర్ ఫిజిసిస్ట్ 2
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ 2
బయో మెడికల్ ఇంజనీర్ 1
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్స్ 1
రిఫ్రాక్షనిస్ట్ 1
కార్డియాలజీ టెక్నీషియన్ 2
ఫిజీయోథెరపిస్ట్ 1
రేడియోగ్రాఫర్ 2
డెంటల్ హైజీనిస్ట్ 1
డెంటల్ టెక్నీషియన్ 2
ల్యాబ్ అటెండెంట్ 5
మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 27
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 23
స్ట్రెచర్ బెరిర్ /స్ట్రెచర్ బాయ్ 3
అటెండర్ 2
ఆయా 1
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 4
ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 2
ఎక్స్ -రే అటెండెంట్ 1
డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 5
ఆప్తోమెట్రిస్ట్ 1
కేత్ ల్యాబ్ టెక్నీషియన్ 2
ఈసీజీ టెక్నీషియన్ 1
స్పీచ్ థెరఫిస్ట్ 2
MRI టెక్నీషియన్ 2
సీ. టీ. టెక్నీషియన్ 2
డైయాలసిస్ టెక్నీషియన్ 5

గవర్నమెంట్ మెటర్నీటి హాస్పిటల్, తిరుపతి  :

 

పోస్ట్ లు ఖాళీలు
ల్యాబ్ టెక్నీషియన్స్ ( గ్రేడ్ - II) 9
ఫార్మసీస్ట్ ( గ్రేడ్ - II) 3
రేడియో గ్రాఫర్స్ 1
ఈసీజీ టెక్నీషియన్స్ 4
MPHA (F) 9
డేటా ఎంట్రీ ఆఫీసర్స్ 3
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 10
ల్యాబ్ అటెండెంట్ 4
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 3
స్ట్రెచర్ బెరేర్ /స్ట్రెచర్ బాయ్ 4
అటెండర్ 5

మొత్తం ఉద్యోగాలు  :

తాజాగా విడుదల అయిన ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 189 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో గుర్తింపు పొందిన బోర్డు ల నుండి 5వ తరగతి /7వ తరగతి /10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఇంటర్ ఒకేషనల్ /డిప్లొమా /బాచిలర్ డిగ్రీ  మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.

కొన్ని విభాగాల ఉద్యోగాలకు ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్స్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్, పీజీడీసీఏ కోర్సులను పూర్తి చేయవలెను అని ప్రకటనలో తెలిపారు.

వయసు  :

42 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ లకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ క్రింది ఆన్లైన్ వెబ్సైటు లింక్ ద్వారా మొదటగా అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకోవలెను.

తదుపరి ఫారం ను నింపి, అప్లికేషన్స్ ఫారం నకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది చిరునామాకు రిజిస్ట్రార్ పోస్టు ను చివరి తేది లోగా పంపవలెను.

లేదా నేరుగా అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు అప్లికేషన్స్ ను పట్టుకుని వెళ్లి అందించవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు ఫీజు  :

ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు "HDS, GMH, TIRUPATI" పేరు మీద 300 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్(DD) ఫీజు గా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ (DSC) బోర్డు ల ద్వారా ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా కేవలం మెరిట్ కమ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 రూపాయలు నుండి 50,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.

SVRR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, తిరుపతి పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పంపవల్సిన చిరునామా  :

The Superintendent,

SVRR GGH,

Tirupati

గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, తిరుపతి పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పంపవల్సిన చిరునామా  :

THE Superintendent,

GMH,

Tirupati

Website

Website  2 

తిరుపతి లో ఉద్యోగాలు Click Here

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 

Post a Comment

0 Comments