Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Ap Local Jobs 2022 : పరీక్ష లేదు, ఏపీ, మంగళగిరి, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎన్ఐసీడీఐటీ కృష్ణా పట్నం ఇండస్ట్రీయల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎన్కేఐసీడీఎల్) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.

3). గౌరవ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Ap Local Jobs 2022

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది    : ఏప్రిల్ 18, 2022 ( 5PM)

విభాగాల వారీగా ఖాళీలు   :

కంపెనీ సెక్రటరీ                                       -      1

మేనేజర్ ( హెచ్ ఆర్ & అడ్మిన్ )              -      1

మేనేజర్ ( మార్కెటింగ్ & స్ట్రాటజీ)           -     1

అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్స్ & అకౌంట్స్)   -     1

అర్హతలు   :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బ్యాచ్ లర్ డిగ్రీ అసోసియేట్ / ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) లో ఫెలో మెంబర్ / ఎల్ఎల్బీ/బీఎల్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ కంపెనీ సెక్రటరీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ మేనేజర్ - హెచ్ఆర్ అండ్ అడ్మిన్ పోస్టులకు మరియు మేనేజర్ - మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ పోస్టులకు  దరఖాస్తు చేసుకోవచ్చు.

మెంబెర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ - ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరియు పై పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు   :

విభాగాలను అనుసరించి 30 నుండి 45 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ ఈ మెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు నిర్ణిత గడువు చివరి తేదీలోగా అభ్యర్థులు తమ తమ రెస్యూమ్ లను ఈ క్రింది ఈ - మెయిల్ అడ్రస్ నకు మెయిల్ చేయవలెను.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.

దరఖాస్తు చేయవలసిన మెయిల్ అడ్రస్  :

Email  :

admindept@kriscity.in

Website 

second website link

Post a Comment

0 Comments