ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఈ పోస్టులను ఫిక్స్డ్ టర్మ్ ఎంగేజ్మెంట్, కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
2). ఇరు తెలుగు రాష్ట్రముల వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 26, 2022
ఉద్యోగాలు - ఖాళీలు :
అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్స్ - 26
మొత్తం పోస్టులు :
దేశవ్యాప్తంగా ఉన్నా ముఖ్యమైన నగరాలలో 26 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ /బోర్డుల నుండి అగ్రికల్చర్ /హార్టికల్చర్ /అనిమల్ హస్బెండరీ /వెటర్నరీ సైన్స్ /డైరీ సైన్స్ /ఫిషరీ సైన్స్ /పిసికల్చర్ /అగ్రి మార్కెటింగ్ & కో - ఆపరేషన్ /కో - ఆపరేషన్ & బ్యాంకింగ్ /ఆగ్రో - ఫారెస్ట్రీ /ఫారెస్ట్రీ /అగ్రికల్చర్ బయో టెక్నాలజీ /ఫుడ్ సైన్స్ /అగ్రికల్చర్ బిజినెస్ మానేజ్మెంట్ /ఫుడ్ టెక్నాలజీ /డైరీ టెక్నాలజీ /అగ్రికల్చర్ ఇంజనీరింగ్ /సేరికల్చర్ విభాగాలలో 4 సంవత్సరాల డిగ్రీ ( గ్రాడ్యుయేషన్) కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో ఎంబీఏ /పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
మినిమం 25 మరియు మాక్సిమం 40 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ/ఎస్టీ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెట్రో సిటీ లలో సంవత్సరానికి 18 లక్షల రూపాయలు మరియు నాన్ - మెట్రో సిటీలలో సంవత్సరానికి 15 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments