ప్రముఖ ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అర్హులే.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Exim Bank Jobs Recruitment
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 28, 2022.
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : మే, 2022.
పోస్టులు - వివరాలు :
ఆఫీసర్స్ - 30
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఓసీ - కంప్లైన్స్ | 1 |
ఓసీ - లీగల్ | 4 |
ఓసీ - రాజసభ | 2 |
ఓసీ - ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 5 |
ఓసీ - హ్యూమన్ రిసోర్స్ | 2 |
ఓసీ - రీసెర్చ్ & అనాలసిస్ | 2 |
ఓసీ - లోన్ మోనిటరింగ్ | 2 |
ఓసీ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిటింగ్ | 1 |
ఓసీ - ఇంటర్నల్ అడిట్ | 2 |
ఓసీ - అడ్మినిస్ట్రేషన్ | 1 |
ఓసీ - రిస్క్ మానేజ్మెంట్ | 2 |
ఓసీ - స్పెషల్ సిట్యుయేషన్ గ్రూప్ | 6 |
పోస్టులు :
మొత్తం 30 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుండి ఫుల్ టైమ్ విధానములో 60% మార్కులతో ఎంబీఏ/పీజీడీబీఏ విత్ స్పెషలైజెషన్ ఇన్ ఫైనాన్స్ /చార్టర్డ్ అకౌంటెంట్స్(సీఏ) / బాచిలర్ డిగ్రీ ఇన్ లా /మాస్టర్ డిగ్రీ / బీఈ/బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ /ఎంఎస్సీ /ఎం. టెక్ ఇన్ సీఎస్/ఐటీ /ఎంబీఏ /పీజీ డిగ్రీ విత్ స్పెషలైజెషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ / పీజీ డిగ్రీ విత్ ఎకనామిక్స్ / బాచిలర్ డిగ్రీ ఇన్ బిజినెస్ మానేజ్మెంట్, ఇంజనీరింగ్ / గ్రాడ్యుయేషన్ తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్స్ నాలెడ్జ్, సంబంధిత విభాగాలలో అనుభవం కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 - 62 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు .
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం అభ్యర్థులకు ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశం కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 600 రూపాయలు మరియు ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు/ews మరియు మహిళా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను అని ప్రకటనలో తెలిపారు.
ఎలా ఎంపిక చేస్తారు:
స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారీ స్థాయిలో నెలకు ఆకర్షణీయమైన వేతనం అందనుంది.
0 Comments