ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబదించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగాలు.
2).కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ.
3).10వ తరగతి అర్హతలుతో కూడా పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లా పరిధిలో గల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Chittoor Dist Jobs 2022
ముఖ్యమైన తేదిలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 18, 2022, (5PM).
విభాగాల వారీగా ఖాళీలు :
పొస్ట్ లు | ఖాళీలు |
---|---|
ల్యాబ్ అటెండెంట్ | 1 |
పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్ | 1 |
కౌన్సిలర్ | 2 |
ఆడియోమెట్రిషియన్ | 4 |
బయో మెడికల్ ఇంజనీర్ | 2 |
ప్లంబర్ | 6 |
ఎలక్ట్రీషియన్ | 3 |
మొత్తం పోస్టులు :
19 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
10వ తరగతి మరియు ఇంటర్ ల్యాబ్ అటెండెంట్ కోర్సు /ఇంటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఒకేషనల్ కోర్సులను పూర్తి చేసి, ఏపీ పారామెడికల్ బోర్డు లో రిజిస్ట్రేషన్ అయినా అభ్యర్థులు అందరూ ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు పోస్ట్ మార్టెమ్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఏ(సోషల్ వర్క్) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు కౌన్సెలర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్ మరియు బీఎస్సీ (ఆడియోలజీ) డిప్లొమా ఇన్ ఆడియో మెట్రి టెక్నీషియన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఆడియో మెట్రిషియాన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
బీ. టెక్ (బయో మెడికల్ ఇంజనీర్ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు బయో మెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10వ తరగతి మరియు ఐటీఐ ( ప్లంబింగ్ ట్రేడ్ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు ప్లంబర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి మరియు ఐటీఐ (ఎలక్ట్రీషియన్) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపి, తదుపరి నింపిన అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు, ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
దివ్యంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
క్వాలిఫాయింగ్ ఎగ్జామినేషన్ మార్కులు, వెయిటేజ్ మరియు అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15,000 నుండి 52,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవలసిన అడ్రస్ ( చిరునామా ) :
జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి వారి (DCHS) కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్.
0 Comments