భారత్ లో ప్రముఖ దిగ్గజ బ్యాంక్ లలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా ఎస్బీఐ బ్యాంక్ తాజాగా తెలిపింది.
ముఖ్యాంశాలు :
1).ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే.
2). కాంట్రాక్టు బేసిస్ లో పోస్టుల భర్తీ
3).భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ముంబై నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. SBI Bank Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 13, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 4, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
వైస్ ప్రెసిడెంట్ & హెడ్ (కాంటాక్ట్ సెంటర్ ట్రాన్స్ఫర్మేషన్ ) | 1 |
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(ప్రోగ్రామ్ మేనేజర్) | 4 |
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(కస్టమర్ ఎక్స్పీరియన్స్) | 2 |
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్(కమాండ్ సెంటర్ మేనేజర్) | 3 |
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (డైలర్ ఆపరేషన్స్ ) | 1 |
మొత్తం పోస్టులు :
11 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాల వారీగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ /ఐటీ/కంప్యూటర్ సైన్స్ /ఐటీ గ్రాడ్యుయేట్స్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఐటీ రిలేటెడ్ ఫీల్డ్స్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మానేజ్మెంట్ /పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ క్వాలిటీ మానేజ్మెంట్ /అనాలిటిక్స్ /డేటా సైన్స్ తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 - 50 సంవత్సరాల వరకూ వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలేను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ /ews కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్టింగ్ /ఇంటర్వ్యూ /సీటీసీ నేగోషియేషన్ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు భారీ స్థాయిలో జీతం అందనుంది.
2nd Apply Link
0 Comments