సబ్సీడరీ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అయిన ఇండ్ బ్యాంక్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి బ్యాంక్ కు సంబంధించిన పోస్టులు.
2). ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఫీజులు మరియు పరీక్షల నిర్వహణ లేకపోవడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశంలో ముఖ్యమైన నగరాలు అయిన చెన్నై, లక్నో, కాన్పూర్, వారణాసి, కోల్ కత్తా, జైపూర్, పాట్న, ట్యూటీకొరన్, వెల్లూరు మరియు ముంబై నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. Indbank Jobs Recruitment 2022
ఇండ్ బ్యాంక్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో తెలిపిన అతి ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : ఏప్రిల్ 26, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
హెడ్ - అకౌంట్ ఓపెనింగ్ డిపార్టుమెంటు | 1 |
అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్ | 4 |
డీపీ స్టాఫ్ | 2 |
డీలర్ - ఫర్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినాల్స్ | 8 |
బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ - ముట్యుయల్ ఫండ్ | 2 |
బ్యాక్ ఆఫీస్ స్టాఫ్ - రిజిస్టర్డ్ ఆఫీస్ & హెల్ప్ డెస్క్ | 3 |
సిస్టమ్స్ & నెట్ వర్కింగ్ ఇంజనీర్ | 1 |
రీసెర్చ్ అనాలిస్ట్ | 1 |
వైస్ ప్రెసిడెంట్ - రిటైల్ లోన్ కౌన్సిలర్ | 1 |
బ్రాంచ్ హెడ్ - రిటైల్ లోన్ కౌన్సెలర్ | 7 |
ఫీల్డ్ స్టాఫ్ - రిటైల్ లోన్ కౌన్సెలర్ | 43 |
మొత్తం పోస్టులు :
73 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎన్ఐఎస్ఎం డిపీ విత్ ఎస్ఓఆర్ఎం సర్టిఫికెట్ /ఎన్ఐఎస్ఎం డీపీ సర్టిఫికెట్ /ఎన్సీఎఫ్ఎం క్వాలిఫీకేషన్ / కంప్యూటర్ సైన్స్ /కంప్యూటర్ అప్లికేషన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఎలక్ట్రానిక్స్ /ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో నాలుగు సంవత్సరాల బీ. టెక్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
21-65 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం ను నింపి, సంబంధిత విద్య ధ్రువీకరణ పత్రాలను జతపరచి, ఈ క్రింది అడ్రస్ కూ నిర్ణిత గడువు చివరి తేది లోగా స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ పంపవలెను.
తదుపరి ఈ క్రింది మెయిల్ అడ్రస్ కూ స్కాన్ చేసిన కాపీలను పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
ఇంటర్వ్యూ విధానమును అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,50,000 రూపాయలు నుండి 10,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
Head Administration
No 480, 1st Floor Khivraj Complex I,
Anna Salai, Nandanam
Chennai - 35.
Email Address :
recruitment@indbankonline.com
0 Comments