వైజాగ్ లో ఇంటర్వ్యూలు , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లో అప్ప్రెంటీస్ పోస్టులు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో పోస్టింగ్స్, 2,00,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్, వెంటనే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి, ఇంటర్వ్యూ వివరాలను తెలుసుకోండి మరియు హాజరు కండి.
డాక్టర్ రెడ్డిస్ లేబర్యాటరీస్ లిమిటెడ్ సంస్థలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి వైజాగ్ లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ముఖ్యాంశాలు:
1). ఈ పోస్టులకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
2). ఇరు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్స్.
3). ఆకర్షణీయమైన వేతనాలు + ఇతర బెనిఫిట్స్ లభించనున్నాయి.
4). ఒక సంవత్సరం అప్ప్రెంటీస్ షిప్ పూర్తి కాగానే అభ్యర్థుల పెర్ఫార్మన్స్ ఆధారంగా ఈ పోస్టులను ఫుల్ టైమ్ / పేర్మినెంట్ గా చేసుకునే ఎంప్లొయ్ మెంట్ ను కల్పించనున్నారు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోని, ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును. Vizag Vacancies
ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఏపీఎస్ఎస్డీసీ, వైజాగ్ నుండి వచ్చిన ఈ ప్రకటన గురించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : ఏప్రిల్ 26, 2022
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, కంచెర్ల పాలెం, విశాఖపట్నం.
విభాగాల వారీగా ఖాళీలు :
అప్ప్రెంటీస్ - 30
అర్హతలు :
మెకానికల్ /ఇన్స్ట్రుమెంటేషన్ /ఎలక్ట్రికల్ విభాగాలలో డిప్లొమా కోర్సులను 2021 లేదా అంతకు ముందుగా పూర్తి చేసిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మరియు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలను చదవడం, వ్రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
మినిమం 18 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేయనున్నారు:
రిటన్ ఎగ్జామ్ మరియు హెచ్. ఆర్ రౌండ్ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 2,00,000 రూపాయలు వరకూ స్టై ఫండ్స్ లభించనున్నాయి.
ఈ స్టై ఫండ్ తో పాటు భోజన మరియు వాహన సౌకర్యాలలో ప్రత్యేక రాయితీను కూడా అందించనున్నారు.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
డేట్ ఆఫ్ బర్త్ లేదా 10వ తరగతి సర్టిఫికెట్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్
10th మరియు డిప్లొమా మార్క్ షీట్స్
పాసింగ్ సర్టిఫికెట్ ఫర్ 2021 బ్యాచ్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
90141 17507
99888 53335
0 Comments