గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3).భారీ స్థాయిలో వేతనములు.
4). పేర్మినెంట్ గా కూడా చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి వచ్చిన ఈ అతి ముఖ్యమైన ప్రకటనకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు ప్రారంభం తేది | ఏప్రిల్ 22, 2022 |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | మే 7, 2022 |
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది | జూన్ 12, 2022 |
విభాగాల వారీగా ఖాళీలు :
మేనేజర్ ( రిస్క్ ) - 40
మేనేజర్ ( క్రెడిట్) - 100
సీనియర్ మేనేజర్ ( ట్రెజరీ) - 5
మొత్తం పోస్టులు :
145 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు ఫుల్ టైమ్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ /పీజిడీఎం ఇన్ ఫైనాన్స్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) / చార్టర్డ్ ఫైనాన్సియల్ ఎనాలిస్ట్ / మాస్టర్స్ ఇన్ మాథ మెటిక్స్ /స్టాటిస్టిక్స్ /ఎకనామిక్స్/ సర్టిఫికెషన్ ఇన్ ఫైనాన్సియల్ రిస్క్ మేనేజ్మెంట్ తదితర కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
25 నుండి 37 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులు 50 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష సిలబస్ - వివరాలు :
ఆన్లైన్ పరీక్షను 170 ప్రశ్నలకు 220 మార్కులను కేటాయించనున్నారు.
పరీక్ష కాలవ్యవధి 120 నిముషాలుగా ఉండబోతుంది.
రీసనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మరియు ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశాలపై ఈ పరీక్షలలో ప్రశ్నలను అడుగనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 48,170 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాలు - నగరాలు :
ఇరు తెలుగు రాష్ట్రములలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చును.
ఆంధ్రప్రదేశ్ :
చీరాల, చిత్తూరు,గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీ కాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్.
0 Comments