భారతదేశ అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడే సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు :
1).ఇవి కోర్ట్ కు సంబంధించిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.
3). భాషల వారీగా పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు న్యూ ఢిల్లీ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
సుప్రీమ్ కోర్ట్ లో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ వివరాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : ఏప్రిల్ 18, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 14, 2022
ఉద్యోగాలు - వివరాలు :
కోర్ట్ అసిస్టెంట్ (:జూనియర్ ట్రాన్స్ లేటర్స్ ) - 25
భాషల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
అస్సామి | 2 |
బెంగాలీ | 2 |
తెలుగు | 2 |
గుజరాతి | 2 |
ఉర్దూ | 2 |
మరాఠీ | 2 |
తమిళ్ | 2 |
కన్నడ | 2 |
మలయాళం | 2 |
మణిపూరి | 2 |
ఒడియా | 2 |
పంజాబీ | 2 |
మొత్తం పోస్టులు :
25 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఇంగ్లీష్ మరియు సంబంధిత భాషలతో కూడిన గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం, కంప్యూటర్ ఆపరేషన్స్ పై ప్రోఫీషియాన్సీ, నాలెడ్జ్ అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
32 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో తెలుపలేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకి నెలకు 44,900 నుండి 76,908 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments