ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిటీ) వైద్యుల యొక్క వేతనమును భారీగా పెంచుతూ మరియు ఈ ఉద్యోగాల యొక్క ప్రొబేషన్ పీరియడ్ ను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది.
ఏపీ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిటీ) వైద్యుల యొక్క కన్సాలీడేటెడ్ జీతము ఇప్పటివరకూ నెలకు 53,500 రూపాయలు ఉండగా, ఇకపై ఈ జీతాన్ని 85,000 రూపాయలు వరకూ పెంచినట్లుగా ఏపీ ప్రభుత్వం ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల చేసింది. AP Govt Salary Update
ఇక ఈ పోస్టులకు సంబంధించిన ప్రోబెషన్ పీరియడ్ ను కూడా మూడు సంవత్సరాలు నుండి రెండు సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
ఏపీ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో తాజాగా ఏపీ వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిటీ ) లుగా
నియమితులు అయ్యే వారికి నెలకు కన్సాలిడేటెడ్ వేతనం 85,000 రూపాయలు వరకూ అందనున్నట్లుగా తెలుస్తుంది.
మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here
0 Comments