Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NMDC Jobs Vizag Interview 2022 Telugu : పరీక్ష లేదు, హైదరాబాద్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రకటన, జీతం 2,60,000 రూపాయలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కు చెందిన ఎన్ఎండీసీ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). మెడికల్ విభాగంలో భర్తీ చేయనున్నారు.

3). ఎటువంటి పరీక్షలు లేవు.

4). భారీ స్థాయిలో వేతనాలు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటన ద్వారా తెలుస్తుంది.

హైదరాబాద్ నుండి వచ్చిన ఈ కేంద్రప్రభుత్వ సంస్థలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యాంశాలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు   :  ఏప్రిల్ 30, 2022 మరియు మే 2 & 4, 2022.

తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు  :  ఏప్రిల్ 30, 2022(శనివారం) - రాయ్ పూర్ ( ఛత్తిస్ ఘర్ ) :

హోటల్ బేబీలాన్ ఇన్, జైలు రోడ్ నియర్ గోబీంద్ సింగ్ స్క్వేర్, దేవేంద్ర నగర్, రాయ్  పూర్, ఛత్తిస్ ఘర్, 492001.

మే 2, 2022 (సోమవారం) - భూభనేశ్వర్ ( ఒడిశా ) :

హోటల్ శాండీస్ టవర్, ప్లాట్ నెంబర్, పీ - 1&పీ -1/ఏ, జయ్ దేవ్ విహార్, భూబనేశ్వర్, ఒడిశా 751013.

మే 4, 2022 (బుధవారం ) - విశాఖపట్నం ( ఆంధ్రప్రదేశ్ ) :

హోటల్ గ్రీన్ పార్క్, వాల్తైర్ మెయిన్ రోడ్, జగదాంబ సెంటర్, నెహ్రూ నగర్, రామ్ నగర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ - 530002.

విభాగాల వారీగా ఖాళీలు   :

మెడికల్ ఆఫీసర్ (జనరల్ మెడిసిన్ )      -      3

మెడికల్ ఆఫీసర్ ( ఆర్థోపీడిక్స్ )              -      1

మెడికల్ ఆఫీసర్ ( ఈఎన్టీ)                     -      1

సీఎంఓ ( రేడియోలాజిస్ట్ )                       -     1

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఎంబీబీఎస్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ /డిప్లొమా ఇన్ జనరల్ మెడిసిన్ /ఆర్థోపెడిక్స్ /ఈఎన్టీ/రేడియోలజీ కోర్సులను పూర్తి చేసి, సంబంధిత విభాగాలలో అనుభవం కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ నిర్ణిత ఇంటర్వ్యూ తేదీలలో ఉదయం 11 గంటలకు క్లోజ్ అవుతాయి అని ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు..?

ఇంటర్వ్యూల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

విభాగాలను అనుసరించి  ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 70,000 రూపాయలు నుండి 2,60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Note  : ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల అనగా ఏప్రిల్ 23, 2022 వ తేది నుండి ఈ క్రింది వెబ్సైటు లో విడుదల కానుంది.

Website 

Notification

Post a Comment

0 Comments