Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway NTPC Exams Dates Telugu 2022 : ఈ రైల్వే పరీక్షలకు తేదీలు విడుదల మిస్ కాకండి.

భారతీయ రైల్వే బోర్డుకు సంబంధించిన  నోటిఫికేషన్ నెంబర్  CEN 01/2019 రైల్వే ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను  తాజాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి తాజాగా విడుదల అయినది.

Railway NTPC Exams Dates Telugu 2022
రైల్వే ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి సంబంధించిన మొదటి స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు గడిచిన సంవత్సరాలు డిసెంబర్ 28,2020 నుండి జూలై 31, 2021 వరకూ మొత్తం 7 ఫేజ్ లలో జరిగిన సంగతి మనకు విధితమే.

ఈ రైల్వే ఎన్టీపీసీ పోస్టుల ఫేజ్ -1 పరీక్షలకు  సంబంధించిన ఫలితాలు మార్చి 30,2022 నుండి ఏప్రిల్ 1, 2022 మధ్య విడుదల అయినాయి. Railway NTPC Exams Dates Telugu 2022

ఇప్పుడు తాజాగా, రైల్వే ఎన్టీపీసీ సీబీటీ - 1 పరీక్షలు వ్రాసి షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు  లెవెల్ -4 మరియు పే లెవెల్ - 6 పోస్టులకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ-2) పరీక్షల యొక్క షెడ్యూల్ ను తాజాగా భారతీయ రైల్వే ప్రకటించినది.

ఈ సీబీటీ - 2 పరీక్షలను రాబోయే నెల మే 9 మరియు మే 10వ తేదీలలో నిర్వహించబోతున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఈ ప్రకటనలో పొందుపరిచినది.

అయితే, లెవెల్ 2,3 మరియు లెవెల్ 5 ఎన్టీపీసీ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్స్ షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తాము అంటూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థులకు ఈ ప్రకటనలో  తెలిపింది.

ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. 8179492829 

Notification

Post a Comment

0 Comments