Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

BOI Jobs Recruitment 2022 : జీతం 89,890 రూపాయలు వరకూ, బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 696 ఉద్యోగాలు

ప్రముఖ లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ఈ ప్రకటన బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై  నుండి తాజాగా విడుదల అయినది

ముఖ్యాంశాలు : 

1). ఈ ఉద్యోగాలను రెగ్యులర్ మరియు కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

2).భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ కానున్నాయి.

3). భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. 

ఈ బ్యాంక్ ఉద్యోగాలకు  అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు అర్హులైన ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో పొందుపరిచిన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది              :  ఏప్రిల్ 26, 2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది                      :   మే 10, 2022

ఏజ్ మరియు విద్యార్హతలకు కట్ ఆఫ్ తేది    :   డిసెంబర్ 1, 2021

ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహణ తేది                            : త్వరలో ప్రకటించబడును.

విభాగాల వారీగా ఉద్యోగాలు :

రెగ్యులర్ బేసిస్  :

ఎకనామిస్ట్       -            2

స్టాటిస్టిషియన్  -            2

రిస్క్ మేనేజర్   -            2

క్రెడిట్ ఎనాలిస్ట్  -         53

క్రెడిట్ ఆఫీసర్స్  -       484

టెక్ అప్రైసల్    -            9

ఐటీ ఆఫీసర్ డేటా సెంటర్     -   42

కాంట్రాక్టు బేసిస్   :

మేనేజర్ ఐటీ - 21, సీనియర్ మేనేజర్ ఐటీ-23,మేనేజర్ ఐటీ (డేటా సెంటర్) - 6,సీనియర్ మేనేజర్ ఐటీ (డేటా సెంటర్ ) -6,సీనియర్ మేనేజర్ (నెట్ వర్క్ సెక్యూరిటీ) - 5,సీనియర్ మేనేజర్ ( నెట్ వర్క్ రూటింగ్)- 10,మేనేజర్ (ఎండ్ పాయింట్ సెక్యూరిటీ)-3,మేనేజర్ ( డేటా సెంటర్ సిస్టమ్ )-6,మేనేజర్ ( అడ్మినిస్ట్రేటర్ విండోస్ )-3,మేనేజర్ ( డేటా సెంటర్ క్లౌడ్ )- 3,మేనేజర్ ( డేటా సెంటర్ స్టోరేజ్ )-3,మేనేజర్ ( డేటా సెంటర్ నెట్ వర్క్ )-4, మేనేజర్ ( డేటా సెంటర్ ఎక్స్ పర్ట్ )- 5 మేనేజర్ ( టెక్నాలజీ ఆర్చిటెక్ట్ )- 2, మేనేజర్ ( అప్లికేషన్ ఆర్చిటెక్ట్ )- 2

మొత్తం ఉద్యోగాలు  :

696 బ్యాంక్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిగ్రీ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా /ఎంబీఏ /పీజీడీబీఎం/పీజీడీఎం/పీజీబీఎం/పీజీడీబీఏ/సీఎస్ / ఐటీ తదితర కోర్సులను  పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు  :

28 సంవత్సరాలు నుండి 37 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్లైన్ టెస్ట్ / గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూల  ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

పరీక్ష - పూర్తి వివరాలు :

ఈ ఆన్లైన్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ తదితర అంశాలపై ప్రశ్నలను అభ్యర్థులకు పరీక్ష పత్రంలో ఇవ్వనున్నారు. మొత్తం పరీక్ష 175 మార్కులకు నిర్వహించనున్నారు. పరీక్ష కాలవ్యవధి 150 నిముషాలుగా ఉంది.

జీతం  :

కేటగిరీల వారీగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 89,890 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

సరికొత్తగా SBI జాబ్స్ మిస్ కాకండి. Click Here

Post a Comment

0 Comments