Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP and TS Full Job Information : తిరుపతి,కాకినాడ,ఏలూరు,ఎన్‌జీ రంగ అగ్రికల్చర్,బీన్యూ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ జాబ్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. వీటికి సంబందించిన పూర్తి సమాచరం క్రింద ఇవ్వడం జరిగింది. 

అవి:

1) తిరుమల విద్యా సంస్థల్లో టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉద్యోగాలు:

2) కాకినాడలో మినీ జాబ్ 

3) ఏలూరు జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు, అర్హత 10వ తరగతి మాత్రమే, అస్సలు మిస్ కావద్దు.

4) ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు, జీతం 35,400 రూపాయలు

5) B NEW మొబైల్ షోరూంలో క్యాషియర్ ఉద్యోగాలు


1) తిరుమల విద్యా సంస్థల్లో టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉద్యోగాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య నగరాలుగా పేరొందిన  రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో గల ప్రముఖ విద్యా సంస్థ తిరుమలలో  వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది .

తిరుమల విద్యా సంస్థలలో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి.

కేవలం ఇంటర్వ్యూల నిర్వహణ మరియు డెమోల ఆధారంగా ఈ పోస్టుల భర్తీ జరుగనుంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టుల భర్తీకు నిర్వహించబోయే  ఇంటర్వ్యూలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు. ఈ ఇంటర్వ్యూ లకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి మనం ఇపుడు సవివరంగా  తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు  :

మే 22 లేదా 23, మే 24 లేదా 25, మే 26 లేదా మే 27, 2022.

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం  :    

ఉదయం 9 గంటల నుండి - మధ్యాహ్నం 2 గంటల వరకూ.

తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు   :

మే 22 లేదా 23, 2022                   -    రాజమహేంద్రవరం

మే 24 లేదా 25, 2022                   -     రాజుల తల్లవలస, విశాఖపట్నం

మే 26 లేదా 27,  2022                  -    భీమవరం.

విభాగాల వారీగా ఖాళీలు    :

సీనియర్ లెక్చరర్స్ ఫర్ జెఈఈ (అడ్వాన్స్ )  అండ్ నీట్ :

మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవలజీ విభాగాలలో సీనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

సీనియర్ లెక్చరర్స్ ఫర్ జేఈఈ ( మెయిన్స్ ) :

ఫాకల్టీ ఫర్ ఐఐటీ/ఒలింపియాడ్ ( 6వ తరగతి - 10 వ తరగతి ) :

మాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగాలలో పై పోస్టులను భర్తీ చేయనున్నారు.

జూనియర్ లెక్చరర్స్ ఫర్ ఎంసెట్ అండ్ ఐపీఈ  :

మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జూవలజీ, ఇంగ్లీష్, సంస్కృతం సబ్జెక్టు విభాగాలలో జూనియర్ లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

హై స్కూల్ టీచర్స్ ( 6వ తరగతి - 10వ తరగతి ) :

ప్రైమరీ స్కూల్ టీచర్స్ ( ఎల్. కే. జీ - 5వ తరగతి ) :

అన్ని సబ్జెక్టు ల వారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

టీచర్ కమ్ వార్డెన్స్

వార్డెన్ కమ్ అసిస్టెంట్ టీచర్స్

అసిస్టెంట్ టీచర్స్

కో - ఆర్డినేటర్స్

ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్

రిసెప్షనిస్ట్స్

కంప్యూటర్ ఆపరేటర్స్ 

ఎంపిక విధానం   :

ఇంటర్వ్యూ మరియు డెమో ల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

జెఈఈ అడ్వాన్స్ /మెయిన్స్ / నీట్ విభాగాలకు సంబంధించిన  లెక్చరర్స్ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 75,000 - 1,80,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

హై స్కూల్  మరియు ప్రైమరీ స్కూల్  టీచర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  15,000 నుండి 50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

మిగిలిన నాన్ - టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 నుండి 20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

 స్టాఫ్ మెంబెర్స్ కు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు  :

రాజమహేంద్రవరం  :

79970 71672

83090 76048

విశాఖపట్నం  :

84639 33335

94943 26051

భీమవరం  :

91826 23317

98853 50289

2) కాకినాడలో మినీ జాబ్ 

డ్రైవ్ , రిలయన్స్ డిజిటల్, కళానికేతన్, ఇండిగో ఎయిర్ లైన్స్ తదితర సంస్థలలో ఉద్యోగాలు, ఆసక్తికరమైన వేతనాలు, మిస్ కావద్దు, పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి. "

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నగరంలో ఉన్న కలెక్టరేట్ ఆవరణలో మినీ జాబ్ డ్రైవ్ నిర్వహణకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ మినీ జాబ్ డ్రైవ్ లో పలు ప్రముఖ వాణిజ్య మరియు వ్యాపార దిగ్గజ సంస్థలు అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కాకినాడ, రాజమండ్రి, మంగళూరు, హైదరాబాద్, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటన కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

మినీ జాబ్ డ్రైవ్ నిర్వహణ తేది         :  మే 23, 2022

మినీ జాబ్ డ్రైవ్ నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు

మినీ జాబ్ డ్రైవ్ నిర్వహణ ప్రదేశం   :

వికాస, కలెక్టరేట్, కాకినాడ, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

పాల్గొనే సంస్థలు  :

లక్సన్స్ బేబీ వరల్డ్

రిలయన్స్ డిజిటల్

కళానీకేతన్ షాపింగ్ మాల్

కాజెంట్ ఈ సర్వీసెస్

ఇండిగో ఎయిర్ లైన్స్

NIIT (ఐసీఐసీఐ బ్యాంక్ )

డీడగ్కీ ట్రైనింగ్

విభాగాల వారీగా ఖాళీలు   :

మేనేజ్ మెంట్ ట్రైనీస్                                                -    4

అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్                                               -    5

కంప్యూటర్ ఆపరేటర్                                                  -    3

స్టాక్ ఇన్ ఛార్జ్                                                               -    3

హెల్పర్స్                                                                      -    2

CRA మేనేజర్                                                               -    5

సేల్స్&కస్టమర్ రిలేషన్ షిప్ అసోసియేట్                     -  30

రిసెప్షనిస్ట్ , క్యాషియర్స్, సేల్స్ అసోసియెట్స్, హెల్పర్స్  -   20

బీపీఓ వాయిస్ ( తెలుగు )                                         -   50

లోడర్స్ / డ్రైవర్స్                                                      -   50

రిలేషన్ షిప్ మేనేజర్ / సీనియర్ ఆఫీసర్స్                  -   50

సర్వీస్ టెక్నీషియన్ / మల్టీ స్కిల్ టెక్నీషియన్              -   50

మొత్తం పోస్టులు  :

మొత్తం వివిధ సంస్థలలో 272 పోస్టులను తాజాగా నిర్వహించనున్న ఈ మినీ జాబ్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

10వ తరగతి /10వ తరగతి లోపు / ఏదైనా విభాగాలలో ఐటీఐ/ డిప్లొమా/డిగ్రీ /బీఈ/బీకామ్/బీఎస్సీ/బీఈ/ఎంకామ్/ఎంబీఏ ఫైనాన్స్/ఎంబీఏ ఫైనాన్సియల్ మార్కెటింగ్ కోర్సులను పూర్తి చేసిన వారు ఈ మినీ జాబ్ డ్రైవ్ కు హాజరు కావచ్చును.

వయసు  :

18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకు నిర్వహించబడే జాబ్ మేళా కు హాజరు కావచ్చును.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ నిర్వహణను అనుసరించి ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

సంస్థల విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అబుర్థులకు సంవత్సరానికి 3,00,000 రూపాయలు వరకూ కూడా జీతములు లభించనున్నాయి.

ఈ జీతములతో పాటుగా ఉచిత భోజన మరియు వసతి సౌకర్యంలను కూడా కొన్ని సంస్థలు ఎంపికైన ఉద్యోగార్థులకు కల్పించనున్నాయి.

Website 

3) ఏలూరు జిల్లా వైద్య శాఖలో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు, అర్హత 10వ తరగతి మాత్రమే, అస్సలు మిస్ కావద్దు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా వైద్య శాఖ పరిధిలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఆకర్షణీయమైన వేతనాలు లభించును.

3). కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏలూరు జిల్లా, ఏలూరు నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

తాజాగా విడుదలైన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : మే 22, 2022 ( 5PM).

విభాగాల వారీగా ఖాళీలు :

FNO - ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ            -   5

సానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్   -   9

మొత్తం పోస్టులు  :

14  పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా సమాన విద్యా అర్హతలను కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

18-42 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం  ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసి తదుపరి పూర్తి చేసిన దరఖాస్తు ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత అడ్రస్ కు చేరవేయవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలలో సాధించిన మార్కులు, మెరిట్, అనుభవం మరియు రిజర్వేషన్స్ అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు,  నెలకు 15,000 రూపాయలకు పైన లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ ( చిరునామా )  :

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి, ఏలూరు వారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

Website  1

Link Website

Notification

4) ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు, జీతం 35,400 రూపాయలు

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న కృషి విజ్యాన్ కేంద్ర, ఉండి లో  ఖాళీగా ఉన్న పోస్టుల  భర్తీకి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్య అంశాలు :

1). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

2). భారీ స్థాయిలో వేతనాలు.

3). టెంపరరీ విధానంలో కాంట్రాక్టు బేసిస్ లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

 ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు కృషి విజ్ఞాన్ కేంద్రం, ఉండి లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంబంధిత సంస్థలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీకు సంబంధించిన విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది : మే 24, 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు 

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

కృషి విజ్యన్ కేంద్ర, ఉండి, వెస్ట్ గోదావరి జిల్లా.

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ( ఫార్మ్ మేనేజర్ ) - 1

అర్హతలు :

ఐసీఏఆర్ నుండి గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి నాలుగు సంవత్సరాల బాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల భర్తీకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

వయసు :

42 సంవత్సరాలు వరకూ వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 35,400 రూపాయలు జీతం+డీఏ+హెచ్. ఆర్. ఏ వంటి సౌకర్యాలు లభించనున్నాయి.

NOTE :

ఈ పోస్టుల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ బయో -డేటా, లేటెస్ట్ పాస్ పోర్ట్ ఫొటోస్ విద్యా అర్హతల దృవికరణ పత్రాల అటెస్టెడ్ కాపీలను తమ వెంట తీసుకుని రావలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

Website

Notification

5) B NEW మొబైల్ షోరూంలో క్యాషియర్ ఉద్యోగాలు:

ప్రముఖ మొబైల్ & ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ అయిన B NEW (బీ న్యూ) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగావకాశాలను తెలుపుతూ తాజాగా ఒక ప్రకటన వచ్చింది.

వివిధ విభాగాలలో భర్తీ కానున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య నగరాలైన నెల్లూరు, విజయవాడ, గుంటూరు, భీమవరం మరియు తణుకు నగరాలలో గల బీ న్యూ షోరూం లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఈ పోస్టుల భర్తీ ప్రకటన గురించి సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విభాగాల వారీగా ఖాళీలు   :

స్టోర్ మేనేజర్స్                                                 -     1

క్యాషియర్స్                                                       -     2

సేల్స్ ఎగ్జిక్యూటివ్                                             -    1

ఆడిటర్స్                                                            -    3

డెప్యూటేషన్ మేనేజర్స్                                   -     1

ప్రోమోటర్స్ (శాంసంగ్, ఎంఐ, వివో, ఒప్పో       -  52

అర్హతలు  :

ఇంటర్మీడియట్ మరియు ఆపై విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులుగా ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

30 సంవత్సరాలు లోపు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులు అని ఈ ప్రకటనలో తెలిపారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి.

Note  :

ఈ పోస్టుల భర్తీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్లను అభ్యర్థులు  సంప్రదించవలెను.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు   :

040-48491111

7337338099

సంప్రదించవల్సిన సమయం :

9 AM to 7 PM

Email  :

cacareers@bnewmobiles.com

Post a Comment

0 Comments