Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag Govt Jobs : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు, వైజాగ్ మరియు హైదరాబాద్ లలో పోస్టింగ్స్, జీతం 29,500

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు:

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

3). భారీ స్థాయిలో వేతనాలు.

4). కాంట్రాక్ట్ బేసిస్ విత్ ఫిక్స్డ్ టర్మ్ విధానంలో పోస్టుల భర్తీ.

Vizag Govt Jobs

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు. Vizag Govt Jobs

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం మరియు హైదరాబాద్, న్యూ ఢిల్లీ నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

బీడీఎల్ నుండి వచ్చిన ఈ ఉద్యోగ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది      :    జూన్ 4, 2022

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది  : జూన్ 13, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( ఎలక్ట్రికల్ ) 2
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( టూల్ డిజైన్ ) 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (హెచ్. ఆర్ ) 1
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ ) 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (స్టోర్ కీపర్) 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (హెచ్. ఆర్ ) 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ ) 1
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్ ) 6
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( హెచ్. ఆర్ ) 1
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ ) 1
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టోర్ కీపర్ ) 3
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( మెకానికల్ ) 5
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( ఎలక్ట్రానిక్స్ ) 4
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( కంప్యూటర్స్ ) 2
ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్ ( టూల్ డిజైన్ ) 2
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( ఎలక్ట్రానిక్ మెకానిక్ ) 4
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( పెయింటర్ ) 1
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( వెల్డర్ ) 1
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ప్లంబర్ ) 2
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టేనో గ్రాఫర్ ) 5
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టేనో గ్రాఫర్ ) 1
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టేనో గ్రాఫర్ ) 6
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్ మెకానిక్) 7
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టేనో గ్రాఫర్ ) 2
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( ఫిట్టర్ ) 7
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( ఎలక్ట్రానిక్ మెకానిక్ ) 2
ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్ ( ఎలక్ట్రీషియన్ ) 4
ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( స్టేనో గ్రాఫర్ ) 2

మొత్తం పోస్టులు :

80 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి  సంబంధిత సబ్జెక్టు విభాగాలలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులు / డిగ్రీ /సీఏ ఇంటర్ / icwa ఇంటర్ /సీఎస్ ఇంటర్ / ఐటీఐ /డీసీసీపీ /డీసీపీ తదితర కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

28 సంవత్సరాలు వయసు లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో గడువు చివరి తేదిలోగా  దరఖాస్తు చేసుకోవలెను.

తదుపరి, దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరచి, నిర్ణిత గడువు చివరి తేదీలోగా ఈ క్రింది చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

యూఆర్/ఓబీసీ/ews కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎస్సీ/ఎస్టీ/దివ్యంగులు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు, మార్కుల మెరిట్, అనుభవం ఆధారంగా ఈ పోస్టులకు  అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయలు నుండి 29,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

SM, C-HR (TA&CP), Bharat Dynamics Limited, Corporate Office, Plot No. 38-39,

TSFC Building (Near ICICI Towers ),

Financial District, Gachibowli, Hyderabad,

Telangana - 500032.

Website

Notification

విశాఖపట్నం లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు: 

జీతం 3.6 లక్షలు, ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి, డిగ్రీ ఉన్న అభ్యర్థులు అందరూ అర్హులే, అస్సలు మిస్ కావద్దు. 

ప్రముఖ సాఫ్ట్ వేర్ సిస్టమ్స్ సంస్థ అయిన మీరకల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

ముఖ్యాంశాలు:

1). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.

2). కేవలం ఇంటర్వ్యూల ద్వారానే పోస్టుల భర్తీ.

3). APSSDC ఆధ్వర్యంలో భర్తీ ప్రక్రియ జరుగనుంది.

4). భారీ స్థాయిలో వేతనాలు + ఇతర అలోవెన్స్ లు.

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రుషికొండ (విశాఖపట్నం ), భోగాపురం ( విజయనగరం ) లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించిన ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఇంటర్వ్యూ నిర్వహణ తేది             :   మే 28, 2022

నిర్వహణ సమయం                        :  ఉదయం 10 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం  :

R. K. జూనియర్ & డిగ్రీ కాలేజ్, R. K. పాలస్, మయూరి జంక్షన్, విజయనగరం - 535002.

విభాగాల వారీగా ఖాళీలు   :

సాఫ్ట్ వేర్ ట్రైనీస్

యూఎస్ ఐటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్

ఐటీ రిక్రూటర్

హెచ్. ఆర్. ఎగ్జిక్యూటివ్స్

మొత్తం ఖాళీలు :

150 ఖాళీలను ఈ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

వయసు :

18-25 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ నిర్వహణ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,80,000 రూపాయలు నుండి 3,60,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతముతో పాటు కంపెనీ నార్మ్స్ ప్రకారం  వసతి / ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కూడా లభించనున్నాయి.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు  :

9000102013, 6301574739, 8099461303, 9988853335

Registration Link

Notification 

రాజమండ్రి లో ఉచిత ఉపాధి శిక్షణ అవకాశాలు:

ఏసీ /ఫ్రిడ్జ్ / సెల్ ఫోన్ రిపేరింగ్ / ఫోటో గ్రఫీ మరియు వీడియో మిక్సింగ్ లలో ఫ్రీ ట్రైనింగ్, పూర్తి వివరాలను ఇప్పుడే చదవండి.

యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, రాజమండ్రి వారు మరియు జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ వారి సంయుక్తముగా 10వ తరగతి పాస్ / ఫెయిల్ అయిన అభ్యర్థులకు వివిధ విభాగాలలో ఉచిత శిక్షణను అందించడానికి గానూ, అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ ఉచిత ఉపాధి శిక్షణ గురించిన అతి ముఖ్యమైన సమాచారంను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

దరఖాస్తులకు చివరి తేది   :  మే  25, 2022

ఉచిత  శిక్షణ  - విభాగములు  :

ఫోటో గ్రఫీ మరియు వీడియో మిక్సింగ్

సెల్ ఫోన్ రిపేరింగ్

హౌస్ వైరింగ్

ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) రిపేరింగ్

రిఫ్రిడ్జ్ రేటర్ రిపేరింగ్

అర్హతలు  :

10వ తరగతి పాస్ / ఫెయిల్ అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ ఉచిత శిక్షణలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

18 నుండి 45 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఫ్రీ ట్రైనింగ్ కు హాజరు కావచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈ ట్రైనింగ్ కు అప్లై చేసుకోవలనుకునే అభ్యర్థులు తమ యొక్క 10వ తరగతి పాస్ / ఫెయిల్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జీరాక్స్ కాపీలు మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ క్రింది అడ్రస్ ను సంప్రదించవలెను. అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ నెంబర్ ద్వారా కూడా ఈ శిక్షణ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

Note : 

ఈ శిక్షణ పొందేవారికి ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు మరియు టూల్ కిట్స్ ఇవ్వబడును అని ఈ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు చేసుకోవాల్సిన అడ్రస్ ( చిరునామా ) :

యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, డోర్ నెంబర్ : 2-40-57, ఆల్కాట్ గార్డెన్స్, రాజమహేంద్రవరం.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు  :

83338 14433

0883 2428807

0883 2420242  

Notification

CMR జ్యువలరీస్, విజయవాడ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య నగరం అయిన విజయవాడ లో త్వరలో ప్రారంభం కానున్న ప్రముఖ  సీ. ఎం. ఆర్ షాపింగ్ మాల్ లో జ్యువలరీ మరియు టెక్స్ట్ టైల్స్ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ నగరంలో  పోస్టింగ్స్ ను కల్పించనున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నా సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ఈ ప్రకటనలో తెలిపారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటన గురించి సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు  : మే 25, 26, 27 & 28- 2022

ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 10AM - 7 PM.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం  :

ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్, ఎస్. బీ. ఐ. ఎదురుగా, ఎం. జి. రోడ్,   మున్సిపల్ కాలనీ, బిగ్ - సీ ప్రక్కన, విజయవాడ - 520010.

విభాగాల వారీగా ఖాళీలు  :

జ్యువలరీ విభాగం  :

ఫ్లోర్ సూపర్ వైజర్స్ ( టీమ్ లీడర్స్ ) 

జ్యువలరీ సేల్స్ ఎగ్జిక్యూటివ్

రీసివింగ్ స్టాఫ్

బిల్లింగ్ స్టాఫ్

గోల్డ్ అప్రైజర్స్

టెక్స్ట్ టైల్స్ విభాగం  :

ఫ్లోర్ సూపర్ వైజర్స్ ( టీమ్ లీడర్స్ )

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, హెల్పర్స్

రిసీవింగ్ స్టాఫ్

బిల్లింగ్ స్టాఫ్

హెచ్. ఆర్

స్టోర్ - వీఎం

టెక్నికల్ సపోర్ట్ (ఐటీ).

సెక్యూరిటీ సూపర్ వైజర్స్ / గార్డ్స్

కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్

అడ్వర్ టైజర్ మెంట్ ఎగ్జిక్యూటివ్

ఎలక్ట్రీషియన్

అర్హతలు :

విభాగాలను అనుసరించి 10 వ తరగతి / ఇంటర్ / ఐటీఐ /   డిగ్రీ / ఎంబీఏ/ఎంహెచ్ఆర్ఎం తదితర కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల భర్తీ నిర్వహణకు జరిపే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం ఉండవలెను. తెలుగు ఇంగ్లీష్ భాషలలో, కంప్యూటర్ విభాగాలలో నాలెడ్జ్  అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

వయసు :

25 నుండి 40 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా / పురుష అభ్యర్థులు అందరూ ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ బయో డేటా, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జీరాక్స్ మరియు గత అనుభవం ఉన్న యెడల దానికి సంబంధించిన ప్రూఫ్ లను తమ వెంట తీసుకుని రావాలని ఈ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు ఫీజు  :

అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

ఈ పోస్టులకి ఎంపికైన అభ్యర్థులకి నెలకు ఆకర్షణీయమైన జీతం + పీఎఫ్+ఈఎస్ఐ+బోనస్ మరియు ఇన్సెంటివ్ లు లభించనున్నాయి.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు  :

టెక్స్ట్ టైల్ విభాగం :

9848295103

7670901567

గోల్డ్ విభాగం :

8142765556

9550121234 

Post a Comment

0 Comments