తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్టుమెంటులో ఖాళీగా ఉన్న డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). జోన్ల వారీగా పోస్టుల భర్తీ జరుగనుంది.
3). వీటిని రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాలుగా పరిగణన చేయవచ్చు.
4). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకి అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రములో పోస్టింగ్స్ ణు కల్పించనున్నారు.
తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన వివరాలను సవివరంగా తెలుసుకుందాం. Fire Service Govt Jobs
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మే 21, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : మే 26, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
డ్రైవర్ ఆపరేటర్స్ - 225
జోన్ల వారీగా ఖాళీలు :
పొస్ట్ లు | ఖాళీలు |
---|---|
జోన్ - 1 - కాళేశ్వరం | 20 |
జోన్ - 2 - బాసర | 21 |
జోన్ - 3 - రాజన్న | 31 |
జోన్ - 4 - భద్రాద్రి | 31 |
జోన్ - 5 - యాద్రద్రి | 31 |
జోన్ - 6 - చార్మినార్ | 70 |
జోన్ - 7 - జోగులాంబ | 21 |
మొత్తం పోస్టులు :
225 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి మరియు ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికెట్ ఇన్ ఆటో ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ మోటార్ వెహికల్ లేదా మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు వాలీడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్, నిర్థిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలిపారు.
వయసు :
21-25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలును మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు:
ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మీజర్ మెంట్స్, డ్రైవింగ్ టెస్ట్ మరియు వ్రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,040 రూపాయలు నుండి 92,050 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments