AP రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి తాజాగా వచ్చినది.
AP రాష్ట్రంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ (ఎస్ఎస్ఏ) పరిధిలోని వృత్తి బాధ్యతలను నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మే నెల రెండవ తేది నుండి తిరిగి మరలా 2022-23 సంవత్సరానికి గానూ తిరిగి తీసుకోవాలని ఎస్ఎస్ఏ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ తాజాగా ఆదేశాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. AP SSA Update
గడిచిన శుక్రవారం నాడు ఎస్ఎస్ఏ పరిధిలో ఉన్న కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులను విధుల నుండి తొలగించినట్లుగా ఆదేశాలు జారీ కాగా, ఇప్పుడు తాజాగా ఎస్ఎస్ఏ జిల్లా చైర్మన్ల అనుమతితో ఉద్యోగుల పని తీరు ఆధారంగా పునః నియామకాలు చేపట్టాలని ఈ ప్రకటనలో ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.
ప్రభుత్వ మరియు బ్యాంక్ ఉద్యోగాల సమాచరం కొరకు స్టోర్సి చూడండి. Click Here
0 Comments