117 సంవత్సరాలు చరిత్ర కలిగిన లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క భారత దేశ వ్యాప్తంగా ఉన్న 727 బ్రాంచులలో వివిధ లొకేషన్ లలో ఖాళీగా ఉన్న రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టుల భర్తీకు సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మరియు ఉత్తర భారత రాష్ట్రాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
సిటీ యూనియన్ బ్యాంక్ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను అన్నిటిని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. City Union Bank Jos Recruitment
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 3, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
రిలేషన్ షిప్ మేనేజర్స్
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన ఫ్రెషర్స్ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
22-27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితర విధానాలను అనుసరించి ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనాలు లభించనున్నాయి.
SBI లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ( State Bank of India Jobs )
ఇవి రెగ్యులర్ బేసిస్ పోస్టులు, జీతం 1,00,350 రూపాయలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్య అంశాలు :
1). ఇవి బ్యాంక్ కు చెందిన పోస్టులు.
2). రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). ఇరు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఎస్బీఐ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలను సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మే 21, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 12, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఏజీఎం ( ఐటీ - టెక్ ఆపరేషన్స్ ) | 1 |
ఏజీఎం ( ఐటీ - ఇన్ బౌండ్ ఇంజనీర్ ) | 1 |
ఏజీఎం (ఐటీ - అవుట్ బాండ్ ఇంజనీర్) | 1 |
ఏజీఎం ( ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పెర్ట్ ) | 1 |
మేనేజర్ (ఐటీ సెక్యూరిటీ ఎక్స్ పెర్ట్ ) | 2 |
డిప్యూటీ మేనేజర్ ( నెట్ వర్క్ ఇంజనీర్ ) | 6 |
డిప్యూటీ మేనేజర్ ( సైట్ ఇంజనీర్ ) | 6 |
డిప్యూటీ మేనేజర్ ( స్టాటిస్టిషియన్ ) | 5 |
మొత్తం పోస్టులు :
23 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో బీఈ/బీటెక్ కోర్సులు, ఫుల్ టైమ్ ఇన్ స్టాటిస్టిక్స్ / అప్లైడ్ స్టాటాస్టిక్స్ / ఎకనామిట్రీక్స్ కోర్సులను కంప్లీట్ చేయవలెను.
సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
35 నుండి 45 సంవత్సరాలు వయసు వరకూ గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పోస్టులకు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ / ews కేటగిరీ అభ్యర్థులు 750 రూపాయలు దరఖాస్తు ఫీజులను చెల్లించవలెను.
ఎస్సీ / ఎస్టీ / దివ్యంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 48,170 రూపాయలు నుండి 69,810 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఇండియన్ బ్యాంక్ లో 312 ఆఫీసర్స్ ఉద్యోగాలు, జీతం 89,890 రూపాయలు వరకూ ( Indian Bank Jobs)
లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంక్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి బ్యాంకు కు సంబంధించిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఇండియన్ బ్యాంకు నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మే 24, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 14, 2022
ఉద్యోగాలు - వివరాలు :
మేనేజర్స్
సీనియర్ మేనేజర్స్
అసిస్టెంట్ మేనేజర్స్
విభాగాల వారీగా ఖాళీలు :
క్రెడిట్
అకౌంట్స్
రిస్క్ మేనేజ్మెంట్
పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్
సెక్టార్ స్పెషలిస్ట్
డేటా ఎనాలిస్ట్
స్టాటిస్టియాన్
ఎకానమిస్ట్
ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆఫీసర్
కార్పొరేట్ కమ్యూనికేషన్
సెక్యూరిటీ
డీలర్
ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ విండోస్
ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ - లైనాక్స్
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ - ఒరాకిల్ డిబీ
ఐటీ, మొదలైనవి.
మొత్తం పోస్టులు :
వివిధ విభాగాలలో మొత్తం ఖాళీగా ఉన్న 312 పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేట్ / మాస్టర్ డిగ్రీ / బీఈ/బీటెక్ /ఎంఈ /ఎంటెక్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్/ సీఏ/సీఎస్/icwa మొదలైన కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
కేటగిరీలను అనుసరించి 23 నుండి 40 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు ( ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలును దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులు 175 రూపాయలును అప్లికేషన్ ఫీజుగా చెల్లించవలెను.
ఎలా ఎంపిక చేస్తారు..?
షార్ట్ లిస్ట్, వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 89,890 రూపాయలు వరకూ జీతం అందనుంది.
0 Comments