ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతీష్టత్మకంగా చేపడుతున్న ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయంలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తాజాగా వచ్చింది.
రాబోయే జూన్, 2022 లో రాష్ట్రంలో ఉన్న గ్రామ మరియు వార్డు సచివాలయంలలో పనిచేస్తున్న అర్హతలు సాధించిన అభ్యర్థులకు ప్రొబేషనరి పీరియడ్ ను డిక్లరేషన్ ప్రక్రియను చేపడుతున్నట్లుగా, ఇందుకు కావలసిన ప్రక్రియను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మరియు సదరు సచివాలయం శాఖకు సంబంధించిన డిపార్టుమెంటు చర్యలును ఆరంభించినది.
ఇప్పుడు, తాజాగా ఈ ప్రొబేషనరీ డిక్లేరేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అర్హతలు కలిగిన గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సాధారణ మరియు అంతర జిల్లాల బదిలీలకు వీలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఏపీ విలెజ్ & వార్డు సెక్రటేరియాట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా ఉద్యోగస్తులకు తెలిపినట్లుగా తెలుస్తుంది.
ఏపీ సీఎం గారు చేసిన ఈ తాజా ప్రకటన ద్వారా ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయంలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
0 Comments