గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీస్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ & పెన్షన్స్ ఆధ్వర్యంలో ఉన్న ఢిల్లీ పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోలీస్ పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.
3). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.
4). భారీ స్థాయిలో వేతనాలు.
5).ఇవి పేర్మినెంట్ ఉద్యోగాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు. SSC head Constable 835 Govt Jobs
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చిన ఈ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : మే 17, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూన్ 16, 2022
ఆన్లైన్ ఫీజు పేమెంట్ కు చివరి తేది : జూన్ 17, 2022
ఆఫ్ లైన్ చలనాకు చివరి : జూన్ 18, 2022
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహణ తేది : సెప్టెంబర్, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
హెడ్ కానిస్టేబుల్ ( మినిస్ట్రీయల్) - మేల్ - 559
హెడ్ కానిస్టేబుల్ ( మినిస్ట్రీయల్ ) - ఫిమేల్ - 276
మొత్తం పోస్టులు :
835 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 (సీనియర్ సెకండరీ ) అనగా ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు నిమిషానికి 30 ఇంగ్లీష్ పదాలు, నిమిషానికి 25 హిందీ పదాలును స్పీడ్ గా టైప్ చేసే నైపుణ్యం కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
నిర్థిష్ట శారీరక ప్రమాణాలు అభ్యర్థులు కలిగి ఉండవలెను అని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది.
వయసు :
18-25 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ / దివ్యంగులు /ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫీజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ & మీజర్ మెంట్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, కంప్యూటర్ (ఫార్మాటింగ్ ) టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష - సిలబస్ :
100 మార్కులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటుంది.
100 ప్రశ్నలను పరీక్షలో ఇవ్వనున్నారు.
నెగటివ్ మార్కింగ్ అమలులో కలదు.
హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం లలో ప్రశ్నలను ఇవ్వనున్నారు.
జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ ఇంటలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ తదితర అంశాలపై ఈ పరీక్షలో ప్రశ్నలు రానున్నాయి.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ - 4 ను అనుసరించి నెలకు జీతంగా 25,500 రూపాయలు నుండి 81,100 రూపాయలు వరకూ జీతం అందనుంది.
పరీక్ష కేంద్రాల నగరాలు - ఎంపిక :
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్.
0 Comments