సధరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 1271 పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది.
ముఖ్యాంశాలు:
1).ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాలు.
2).అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
3). జూనియర్ లైన్ మాన్ పోస్టులకు అర్హతలుగా 10వ తరగతి మరియు ఐటీఐ ఉండే అవకాశం ఉంది.
4). భారీ స్థాయిలో వేతనాలు లభించే అవకాశం కూడా కలదు.
5). రెగ్యులర్ పద్దతిలోనే భర్తీ జరుగనున్నట్లుగా తెలుస్తుంది.
ఈ ప్రకటన ప్రకారం ఉద్యోగాల భర్తీ సంఖ్య ఈ క్రింది విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్ - 70
సబ్ - ఇంజనీర్ / ఎలక్ట్రికల్ - 201
జూనియర్ లైన్ మెన్ - 1000
మొత్తం పోస్టులు :
1271 పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విద్యా అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, ఎంపిక చేయు విధానం తదితర ముఖ్యమైన అంశాలతో కూడిన నోటిఫికేషన్ మే 11,2022 తేదీనాడు విడుదల చేయనున్నారు.
నోటిఫికేషన్ విడుదల అయినా మరుక్షణం పూర్తి వివరాలను మన telugucompititive.com వెబ్సైటు ద్వారా మీకు అందిస్తాము. కావున, అభ్యర్థులు అందరూ ప్రతీ రోజు మన వెబ్సైటు ను వీక్షించగలరు.
జూనియర్ లైన్ మెన్ 1000 :
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఉన్న ది సౌథెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్) లో ఖాళీగా ఉన్న జూనియర్ లైన్ మాన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్య అంశాలు :
1). ఇవి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ.
3). భారీ స్థాయిలో వేతనాలు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.
95% పోస్టులను లోకల్ డిస్ట్రిక్ట్ /సర్కిల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నరని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
కావున, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చిన ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తు/ఫీజు పేమెంట్ ప్రారంభం తేది : మే 19, 2022
ఆన్లైన్ దరఖాస్తు / ఫీజు పేమెంట్ చివరి తేది : జూన్ 8,2022
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : జూలై 11,2022 ( డౌన్ లోడ్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.)
పరీక్ష నిర్వహణ తేది : జూలై 17, 2022
ఉద్యోగాలు - వివరాలు :
జూనియర్ లైన్ మాన్ - 1000
విభాగాల వారీగా ఖాళీలు :
లిమిటెడ్ రిక్రూట్మెంట్ - 553
జనరల్ రిక్రూట్మెంట్ - 447
మొత్తం పోస్టులు :
1000 ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ / బోర్డుల నుండి ఎస్ఎస్ఎల్సీ /ఎస్. ఎస్. సీ /10వ తరగతి తో ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్ / వైర్ మెన్ ) కోర్సులు లేదా రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ( ఎలక్ట్రికల్ ట్రేడ్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18-35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం, ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 200 రూపాయలును ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజులుగా చెల్లించవలెను.
మరియు జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఈ 200 రూపాయలు ఫీజుతో బాటు మరో 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /బీసీ /ews కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 120 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
వ్రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్ తదితర టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
పరీక్ష - సిలబస్ :
మొత్తం 80 మార్కులకు పరీక్షను నిర్వహించనున్నారు.80 ప్రశ్నలకు 120 నిమిషాల కాల వ్యవధిను ఇవ్వనున్నారు.
ఐటీ (ఎలక్ట్రికల్ ట్రేడ్ ) మరియు జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలను అడుగనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 24,340 రూపాయలు నుండి 39,405 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
Short Notification
0 Comments