విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు, జీతం 20,000 రూపాయలు వరకూ, 10వ తరగతి అర్హతలతో కూడా పోస్టుల భర్తీ, ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు, అస్సలు మిస్ కావద్దు, ఇప్పుడే చూడండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు చెందిన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యాంశాలు:
1). ఇవి అంతర్జాతీయ విమానాశ్రయం కు చెందిన పోస్టులు.
2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై కు అర్హులే.
3). భారీ స్థాయిలో వేతనాలు.
4). ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ లో పోస్టుల భర్తీ.
5). 10వ తరగతి అర్హతలుతో కూడా పోస్టుల భర్తీ.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు.
ఏఐఏఎస్ఎల్ నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ లో తెలిపిన ముఖ్యమైన వివరాలు అన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. Airport Jobs 2022 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 18, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పొస్ట్ లు | ఖాళీలు |
---|---|
కస్టమర్ ఏజెంట్ | 8 |
జూనియర్ కస్టమర్ ఏజెంట్ | 4 |
రాంప్ సర్వీస్ ఏజెంట్ | 2 |
యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ | 6 |
హ్యాండీ మాన్ | 25 |
మొత్తం పోస్టులు :
44 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి 10+2+3 విధానంలో గ్రాడ్యుయేట్ / గ్రాడ్యుయేట్ తో పాటు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిప్లొమా ను కంప్లీట్ చేసిన వారు కస్టమర్ ఏజెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
10+2 విధానంలో సంబంధిత సబ్జెక్టు విభాగాలలో డిప్లొమా కోర్సులు కంప్లీట్ అయిన వారు జూనియర్ కస్టమర్ ఏజెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మెకానికల్ /ఎలక్ట్రికల్ /ప్రొడక్షన్ /ఎలక్ట్రానిక్స్ /ఆటో మొబైల్ ఇంజనీరింగ్ విభాగాలలో మూడేళ్ల డిప్లొమా కోర్సులను కంప్లీట్ చేసిన వారు లేదా ఆటో ఎలక్ట్రికల్ /ఎయిర్ కండిషనింగ్ /డీజిల్ మెకానిక్ /బెంచ్ ఫిట్టర్ /వెల్డర్ విభాగాలలో ఐటీఐ విత్ ఎన్సీటీవీటీ కోర్సులను కంప్లీట్ చేసి, వాలీడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అందరూ రాంప్ సర్వీస్ ఏజెంట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
10వ తరగతి అర్హతలుగా కలిగి ఉండి, హెచ్. ఎం. వీ. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు యూటీలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
10వ తరగతి పాస్ అయ్యి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం మరియు వ్రాయడం వచ్చి ఉండి, లోకల్ మరియు హిందీ లాంగ్వేజ్ లపై నాలెడ్జ్ కలిగి ఉన్న వారు హ్యాండీ మెన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును.
వయసు :
28 నుండి 33 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత అడ్రస్ కు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / యూఆర్ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎక్స్ సర్వీస్ మెన్ / ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ /ట్రేడ్ టెస్ట్ / స్క్రీనింగ్ టెస్ట్ తదితర విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 14,610 రూపాయలు నుండి 19,350 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :
HR Department,
AI Airport Services Limited,
AI Unity Complex, Pallavaram Cantonment,
Chennai - 600 043.
0 Comments