తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఆధ్వర్యంలో ఉన్న ఎస్. వీ. ఆయుర్వేద కాలేజ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యమైన అంశాలు:
1). ఇవి టీటీడి కు చెందిన పోస్టులు.
2). భారీ స్థాయిలో వేతనాలు.
3). రెగ్యులర్ గా కూడా ఈ ఉద్యోగాలను చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టీటీడి, ఎస్. వీ. ఆయుర్వేద కళాశాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
టీటీడి నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Tirupati TTD Jobs 2022
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : మే 21, 2022.
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
లెక్చరర్ ఇన్ సంహిత | 1 |
లెక్చరర్ ఇన్ సిద్ధాంత | 1 |
లెక్చరర్ ఇన్ క్రియ శరీర్ | 1 |
లెక్చరర్ ఇన్ ద్రవ్యగుణ | 2 |
లెక్చరర్ ఇన్ రసశాస్త్ర | 2 |
లెక్చరర్ ఇన్ ఆగదతంత్ర ఎవంవిధి వైధ్యక | 1 |
లెక్చరర్ ఇన్ శాలక్య తంత్ర | 1 |
లెక్చరర్ ఇన్ పంచ కర్మ | 1 |
మొత్తం ఖాళీలు :
10 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఆయుర్వేద కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మరియు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హిందూ రీలీజీయన్ కు చెందిన వారు అయి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
41 సంవత్సరాలు వయసు కలిగిన ఓపెన్ కేటగిరీ(ఓసీ) అభ్యర్థులు మరియు 45 సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ /ఎస్టీ / బీసీ కేటగిరీ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునే దరఖాస్తు ఫారంలను పూర్తి చేసి, వాటికీ సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను గేజీటెడ్ ఆఫీసర్ చేత అటెస్టెడ్ చేయించి, జతపరచి నిర్ణిత గడువు చివరి తేదీలోగా, సంబంధిత అడ్రస్ కు పంపవలెను.
కావాల్సిన డాక్యుమెంట్స్ :
కంప్లీట్ బయో డేటా
ఎడ్యుకేషనల్ క్వాలిఫీకేషన్ సర్టిఫికెట్స్
మార్క్స్ స్టేట్ మెంట్స్
ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్
క్యాస్ట్ సర్టిఫికెట్ మొదలైనవి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.
ఎలా ఎంపిక చేస్తారు..?
బోర్డు నియమ నిబంధనలను అనుసరించి వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ తదితర విధానాలను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 54,060 రూపాయలు నుండి 1,40,540 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులను పంపవల్సిన అడ్రస్ ( చిరునామా ) :
To The Executive Officer,
T. T. D,
K. T. Road, Tirupati.
0 Comments